సీరియస్ వార్నింగ్, అత్యంత ప్రమాదకర వ్యక్తుల జాబితాలో ప్రభాస్, రానా: నెట్ లో జాగ్రత్త

ప్ర‌ముఖ‌ తమిళ నటుడు ప్రభు, తెలుగు హీరోలు బాహుబలి ప్రభాస్, రానాల పేర్ల‌ను ఇంట‌ర్నెట్లో సెర్చ్ చేస్తే ప్ర‌మాద‌క‌ర వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ వెల్ల‌

అభిమానం తో వాళ్ళ పేర్లు ఇంటర్నెట్ లో గనక సెర్చ్ చేసారంటే మీరు ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారన్నమాటే. ఇంతకీ ఎవరా ఇద్దరు ప్రముఖులు? వాళ్ళ పేర్లు గూగుల్ లో సెర్చ్ చేస్తే వచ్చే రిస్కేమిటీ అనుకుంటున్నారా?? ప్ర‌ముఖ‌ తమిళ నటుడు ప్రభు, తెలుగు హీరోలు బాహుబలి ప్రభాస్, రానాల పేర్ల‌ను ఇంట‌ర్నెట్లో సెర్చ్ చేస్తే ప్ర‌మాద‌క‌ర వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ వెల్ల‌డించింది.

ప్రభాస్, రానాలతో జాగ్రత్త

ప్రభాస్, రానాలతో జాగ్రత్త

ఈ జాబితాలో ఉత్తరాది నటుల్లో కమేడియన్ కపిల్ శర్మ, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఉండగా, దక్షిణాదిలో ప్రభు మొదటి స్థానం లో, ప్రభాస్ రెండో స్థానం లో ఉందగా బాహుబలిలోనే నటించిన రానా మూడో స్థానం లో ఉన్నాడు.ఇటీవల కాలంలో డిజిటల్‌ ప్రపంచం ఎక్కువగా పెరుగుతుండటంతో, అభిమానులు తమకు నచ్చిన సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌నే ఆశ్రయిస్తున్నారు.

అనుమానిత లింక్‌లు

అనుమానిత లింక్‌లు

ఇలా సెర్చ్‌ చేసేటప్పుడు అనుమానిత లింక్‌లను క్లిక్‌ చేయాల్సి వస్తుందని, వాటివల్ల ఏర్పడే ప్రమాదాన్ని మెకాఫీ వెల్లడించింది. 2016 లో ఈ జాబితాలో సోనాక్షీ సిన్హా మొదటిస్థానం లో ఉండగా దక్షిణాది హీరోలు అసలు ఈ జాబితాలోనే లేరు. సోనాక్షి సిన్హాను వెనక్కి నెట్టేసి మెకాఫీ మోస్ట్‌ సెన్సేషనల్‌ సెలబ్రిటీల జాబితా 2017లో ప్రభాస్, రానాలు ఉండటం కొంత ఆందోళన పడాల్సిన విషయమే.

హానిక‌ర‌మైన వెబ్‌సైట్లు

హానిక‌ర‌మైన వెబ్‌సైట్లు

సెర్చ్ ఇంజ‌న్‌ల‌లో సెల‌బ్రిటీల పేరుతో సెర్చ్ చేస్తున్న‌ప్పుడు ఒక్కోసారి అత్యంత హానిక‌ర‌మైన వెబ్‌సైట్లు ఓపెన్ అవుతుంటాయి. అలా ప్ర‌భు, ప్రభాస్, రానా ల గురించి సెర్చ్ చేస్తున్న‌పుడు ఎక్కువ‌గా హానిక‌ర వెబ్‌సైట్లు ఓపెన్ అవుత‌న్నాయ‌ని సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫె వెల్ల‌డించింది.

 కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే

కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే

సెల‌బ్రిటీ పేర్ల మీద ఉన్న సైట్లు ఎంత వ‌ర‌కు సురక్షితం అనే విష‌యంపై మెకాఫే ప్ర‌తీ యేటా అధ్య‌య‌నం చేస్తుంది. అంటే వీళ్ల పేర్లమీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్గెట్లమీద దాడి చేసే ప్రమాదకర వైరస్ ఉన్న వెబ్ సైట్లు ఎక్కువగా దాడి చేసే అవఖాశం ఉన్నట్టే. ఇక మీరు ఆ సైట్ ని ఓపెన్ చేసారంటే ప్రమాదం లో పడ్డట్టే. కాబట్టి అభిమాన నటులూ, హీరోల గురించి సెర్చ్ ఇంజిన్లలో వెతుకుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X