చండీఘర్ యూనివర్శిటీలో ప్రభాస్-రానా బలప్రదర్శన (వీడియో)
ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి టీం చండీఘర్ యూనివర్సిటీకి వెళ్లింది. అక్కడి స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాహుబలి, భళ్లాలదేవుడి మధ్య జరిగిన బలప్రదర్శన పోటి జరిగింది.
హైదరాబాద్: బాహుబలి-2 మూవీ రిలీజ్‌కు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో చిత్ర యూనిట్ అంతా సినిమా ప్రమోషన్లో బిజీ అయిపోయారు. సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం కూడా రిలీజ్ అవుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా బాహుబలి టీం చండీఘర్ యూనివర్సిటీకి వెళ్లింది. అక్కడి స్టూడెంట్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాహుబలి, భళ్లాలదేవుడి మధ్య జరిగిన బలప్రదర్శన పోటి జరిగింది. ఇందకు సంబందించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసారు.
ఆసక్తిగా జరిగిన పోటీ
స్టూడెంట్స్ బాహుబలి టీం వైపు కొందరు..... భళ్ళాలదేవుడి టీమ్ వైపు కొందరు విడిపోయి తమ అభిమాన నటులకు మద్దు ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ సందడి చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

భారీ రిలీజ్
బాహుబలి 2 మూవీ ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు 6500 థియేటర్లలో సినిమా రిలీజవుతోంది. ప్రీ బుకింగ్ పేరుతో ఆన్ లైన్లో టికెట్ బుకింగ్ కూడా మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని కార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

బాహుబలి ఎఫెక్ట్: ప్రభాస్ మీద కన్నేసిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మేకర్స్

సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!



Click it and Unblock the Notifications











