»   » అక్కడ చాలా సీరియస్: అందుకే ‘బాహుబలి’ టీం మొత్తం...

అక్కడ చాలా సీరియస్: అందుకే ‘బాహుబలి’ టీం మొత్తం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో 20 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదో పెద్ద సినిమా కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని వదలుకోవడం లేదు.

జులై 10వ తేదీన బాహుబలి సినిమా ప్రపంచ వ్యప్తంగా తెలుగు, తమిళం, హిందీ మళయాలంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కవ మంది ప్రేక్షకులు రీచ్ కావడానికి విదేశాల్లో ఆయా భాషల్లో విడుదలువున్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ అటాచ్ చేసి విడుదల చేస్తున్నారు.


దర్శకుడు రాజమౌళితో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ తమిళం, తెలుగు, మళయాలంలో ప్రమోషన్స్ గురించి చూసుకుంటున్నారు. ఇక ప్రభాస్, రానా, తమన్నా తమ సమయాన్ని హిందీలో ప్రమోషన్స్ నిర్వహించడానికి ఉపయోగిస్తున్నారు.


వాస్తవానికి సౌత్ లో సినిమా ప్రమోషన్లు అంత సీరియస్ గా తీసుకోరు. కానీ బాలీవుడ్లో అలా కాదు. సినిమా ప్రమోషన్స్ చాలా సీరియస్ గా నిర్వహిస్తారు. సల్మాన్, షారుక్ లాంటి స్టార్స్ సైతం స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటారు. హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కరణ్ జోహార్ బాలీవుడ్లో ప్రమోషన్స్ బాగా నిర్వహించాలని సీరియస్ గా చెప్పడంతో ప్రభాస్, రానా, తమన్నా ముంబైలో ఇప్పటికే తమ పని మొదలు పెట్టారు.


తమన్నా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. బాహుబలి సినిమా ఆమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లో భాగంగా స్వయంగా తానే యాంకర్ అవతారం ఎత్తింది. అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.


బాహుబలి

బాహుబలి


బాహుబలి ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.


తమన్నా

తమన్నా


బాహుబలి ప్రమోషన్ కార్యక్రమాల్లో మొదటి రోజు తమన్నా లుక్ ఇలా...


సెల్పీ..

సెల్పీ..


ప్రమోషన్లో భాగంగా బాహుబలి స్టార్స్ సెల్పీ మూమెంట్స్..


బాముబలి మూవీ

బాముబలి మూవీ


సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్, రానా, తమన్నా ఇలా...


వేగవంతం

వేగవంతం


సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసారు.


తమన్నా

తమన్నా


బాహుబలి సినిమా ప్రమోషన్లలో భాగంగా రెండో రోజు తమన్నా లుక్ ఇలా...


నోవాటెల్

నోవాటెల్


ముంబై నోవాటెల్ హోటల్ లో బాముబలి టీం.


లిటిల్ ఫ్యాన్స్

లిటిల్ ఫ్యాన్స్


ముంబైలో లిటిల్ ఫ్యాన్స్ తో కలిసి రానా సెల్పీ.
English summary
Rajamouli's magnus opus, Baahubali is nearing it's big day and the team has not been leaving any stone un-turned to make the film a pride of Indian Cinema. Baahubali is all set to hit screens on July 10, world wide in Hindi, Telugu, Tamil and Malayalam languages and it will also have subtitles attached to it to reach out to large number of audiences, who are very eager to watch the film.
Please Wait while comments are loading...