స్టార్ హీరోలు ప్రబాస్, రవితేజ ఇద్దరూ బయటి పొలిటికల్ ఫీవర్ తో సంభంధం లేకుండా పనిచేసుకుపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినీ పరిశ్రమ మూడు ముక్కలుగా మారి ఎవరికి తోచిన, నచ్చిన, సీట్లు ఇచ్చిన పార్టీలకు ప్రచారానికి తరిలి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ తమ సినమాలతో బిజీగా ఉన్నారు. రవితేజా ప్రస్తుతం కిక్ చిత్రం షూటింగ్ లో ఉన్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అనంతరం ఆంజనేయులు అనే చిత్రంలో రవితేజ చేయటానికి పచ్చజెండా ఊపారు. ఆ చిత్రాన్ని యువత దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ప్రబాస్ బిల్లా మొన్నీ మధ్యే రిలీజైంది. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఏక్ నిరంజన్ చిత్రం చేస్తున్నాడు. అనంతరం దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు సినిమా ఆ తర్వాత కరుణాకర్ దర్శకత్వంలో డియర్ సినిమా రెండు వరస లైన్ లో ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా లేకుండా అంతా పార్టీ జెండాలు పుచ్చుకు రోడ్డుపై పడితే వీళ్ళిద్దరూ షూటింగ్ లలో పాల్గొనటం హాట్ టాపిక్ అయ్యింది.