అనుష్క అంటే ఎంత ఇష్టమో : ప్రభాస్ కామెంట్స్ హాట్ టాపిక్!
Recommended Video

టాలీవుడ్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క మధ్య మంచి స్నేహ బంధం ఉందనేది అందరికీ తెలిసిన సంగతే. 2009లో ప్రభాస్‌తో కలిసి తొలిసారిగా 'బిల్లా' చిత్రంలో నటించిన అనుష్క ఆ తర్వాత మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో నటించింది. బాహుబలి సినిమాకు దాదాపు ఐదేళ్లు కలిసి పని చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ మధ్య ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు, పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వినిపించిన సంగతి సంగతి తెలిసిందే.

భాగమతి గురించి ప్రభాస్ కామెంట్స్
అనుష్క నటించిన ‘భాగమతి' మూవీ ట్రైలర్ సోమవారం విడుదలయింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రభాస్ అనుష్క గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇపుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

అనుష్క గురించి గొప్పగా...
‘భాగమతి' ట్రైలర్ చూసిన అనంతరం ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీలో స్పందిస్తూ.... ‘ అనుష్క చాలా కష్టపడుతుంది. ట్రూ హార్డ్ వర్కర్. ఏ పని చేసినా చాలా డెడికేషన్‌తో చేస్తుంది. భాగమతి సినిమా స్వీటీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదే విధంగా దర్శకుడు అశోక్, యువి క్రియేషన్స్ వారికి గుడ్ లక్' అంటూ ప్రభాస్ వ్యాఖ్యానించారు.

అనుష్క ప్రతి విషయంలోనూ...
ప్రభాస్ సాధారణంగా ఇతర హీరోలు, హీరోయిన్ల సినిమాల విషయంలో స్పందించడం చాలా తక్కువ. అయితే అనుష్కకు సంబంధించిన ప్రతి సినిమా విషయంలోనూ ప్రభాస్ తప్పకుండా స్పందిస్తుంటారు. భాగమతి టీజర్ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్ స్వీటీపై ప్రశంసలు కురిపించారు. ‘ప్రతి సినిమాలో కొత్తగా ప్రయత్నించడంలో ఆమె తొలి వరుసలో ఉంటారు' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

ఒక్క అనుష్కతో మాత్రమే ప్రభాస్ చాలా క్లోజ్
ఇప్పటి వరకు ప్రభాస్ చాలా సినిమాలు చేశారు. చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించారు. స్వతహాగా చాలా సిగ్గరి అయిన ప్రభాస్ హీరోయిన్లకు వీలైనంత దూరంగా ఉంటారు. అందుకే గతంలో ఏ హీరోయిన్ విషయంలో కూడా ప్రభాస్ మీద పుకార్లు రాలేదు. ఆయన చాలా క్లోజ్‌గా ఉండే ఒకే ఒక్క హీరోయిన్ అనుష్క మాత్రమే.

ఇద్దరిపై అనేక పుకార్లు షికార్లు
వయసు మీద పడుతున్న ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండటం, అనుష్కతో క్లోజ్ గా ఉండటం, ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండి పోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.

‘సాహో' జస్ట్ మిస్
బాహుబలి తర్వాత ‘సాహో' మూవీ మొదలైంది. ఈ చిత్రంలో కూడా ప్రభాస్-అనుష్క కలిసి నటించాల్సి ఉంది. అయితే అనుష్క డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో ఈ సినిమా మిస్సయింది.

యువి ప్రొడక్షన్స్ వెనక ప్రభాస్
‘భాగమతి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తుంది ప్రభాస్ స్నేహితులే. దీంట్లో ప్రభాస్ పెట్టుబడులు కూడా ఉన్నట్లు కొందరు అంటుంటారు.
జనవరి 26న భాగమతి విడుదల
‘పిల్ల జమిందార్' ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్న ‘భాగమతి' చిత్రం జనవరి 26న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











