'సాహో' కారణంగా వెనక్కితగ్గిన దర్శకనిర్మాతలు.. ప్రభాస్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో!
Recommended Video
చిత్ర పరిశ్రమలో చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడమనేది సాధారణమైన విషయమే. ముఖ్యంగా మూవీ రిలీజ్, క్లాష్ విషయంలో ఇలాంటి ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్ని పెద్ద సినిమాల కారణంగా ఇంకొన్ని సినిమాలు అనుకున్న సమయానికి కాకుండా వేరొక డేట్ లోకి వెళ్లడం, తీరా రిలీజ్ దగ్గరపడ్డాక వాయిదా పడటం అనేవి ఆశ్చర్య పరుస్తుంటాయి. సరిగ్గా సాహో విషయంలో అదే జరిగింది. సాహో కారణంగా ఏకంగా నాలుగు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఈ వాయిదాపై ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు.

సాహో కారణంగా వెనక్కి తగ్గక తప్పలేదు
దేశవ్యాప్తంగా సాహో సినిమా ఆగస్టు 30 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ సినిమా కావడం, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమా కోసం ఎక్కువ మొత్తంలో థియేటర్స్ కేటాయించడంతో ఇతర సినిమాలకు థియేటర్స్ దొరికే పరిస్థితి లేదు. దీంతో దాదాపు నాలుగు సినిమాల దర్శకనిర్మాతలు తమ తమ సినిమాలను వాయిదా వేసుకోవడం జరిగింది.

ఇదీ ప్రభాస్ రియాక్షన్
ఆగస్టు 30 వ తేదీన సాహో సినిమా కారణంగా తమ తమ చిత్రాల విడుదల తేదీలు రీ-షెడ్యూల్ చేసుకున్నందుకు ఆ చిత్ర నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు బిగ్ థాంక్స్. 'సాహో' చిత్ర బృందం తరఫున ధన్యవాదాలు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు ప్రభాస్.

సాహోపై భారీ హైప్.. ప్రేక్షకుల్లో ఆతృత
భారతదేశ సినీ చరిత్రలో రికార్డులు తిరగరాసిన ‘బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో' కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఆతృతను మరింత పెంచేశాయి.

సాహో మూవీ
‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కింది సాహో మూవీ. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. శ్రద్ధా కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా. నాలుగు భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతుంది. గతంలో ఎన్నడూ చూడని యాక్షన్స్ సీన్స్ ఈ సినిమాలో చుడనున్నారని చెబుతోంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











