పెళ్ళైతే గానీ ఈ సమస్య పోదు.. ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా: ప్రభాస్

Recommended Video

Prabhas Replies Frustrated Answers To Reporters About Rumors On Him || Filmibeat Telugu

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. అందులో ఒక్క 'బాహుబలి' సినిమా కోసమే దాదాపు ఐదేళ్లు కలిసి ట్రావెల్ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను ఇటు ప్రభాస్, అటు అనుష్క ఎన్నిసార్లు ఖండించినా ఫలితం ఉండటం లేదు. దీంతో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ ఆసక్తికరంగా స్పందించారు ప్రభాస్. ఇంతకీ ఆయన ఏమన్నారు? వివరాల్లోకి పోతే..

ఎక్కడికెళ్లినా అదే ప్రశ్న

ఎక్కడికెళ్లినా అదే ప్రశ్న

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన కొత్త సినిమా ‘సాహో' ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల చిత్ర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ప్రభాస్‌కి మళ్ళీ అనుష్కతో రిలేషన్‌షిప్‌కి సంబందించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

చిరాకు పడిన ప్రభాస్

చిరాకు పడిన ప్రభాస్

‘మీరు.. అనుష్క డేటింగ్ చేస్తున్నారంట కదా' అని ఒకరంటే.. ‘ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంట కదా' అని మరొకరు అంటున్నారు. అంతేకాదు, గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న అంశాలు అని ‘అనుష్క - ప్రభాస్ మ్యారేజ్' అని కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఉదంతమే ఎదురుకావడంతో కాస్త చిరాకు పడ్డారు ప్రభాస్.

మేమన్నా ఇంట్లో దాక్కున్నామా?

మేమన్నా ఇంట్లో దాక్కున్నామా?

‘ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. అన్ని సార్లూ నేను సమాధానం చెప్పాను. మళ్లీ చెబుతున్నాను.. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? మేమన్నా ఇంట్లో దాక్కున్నామా? అని చెబుతూ.. అంతెందుకు అనుష్కను కలిసి రెండేళ్లు అయిపోయింది' అని చెప్పుకొచ్చాడు ప్రభాస్.

ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా

ఈ సారి అనుష్కతో డైరెక్ట్‌గా చెప్పేస్తా

ఇక ఇలాంటి రూమర్స్‌కి తెరపడాలంటే.. ముందు అనుష్కనో లేక నేనో పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పటిదాకా ఈ సమస్య పోయేలా అనిపించడం లేదు. ఈసారి అనుష్క కలిసినప్పుడు త్వరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని డైరెక్ట్‌గా చెప్పేస్తా.. అప్పుడైతే గానీ మీరు ఈ ప్రశ్నలు ఆపేలా లేరు అన్నారు ప్రభాస్.

సాహో ప్రభాస్

సాహో ప్రభాస్

ప్రభాస్ తాజా సినిమా విషయానికొస్తే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సాహో. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా ఆగస్టు 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటించింది. చిత్రంలో టైగర్ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X