ప్రభాస్ రెబల్ 50డేస్ (సెంటర్స్ లిస్ట్)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం ఇటీవల విడుదలై ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు లారెన్స్ ఈచిత్రాన్ని పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నం కాస్తా ఓవర్ అయిపోయి టార్చర్ మూవీలా మారి పోయింది.
ప్లాప్ టాక్ లోనూ ఈచిత్రం కొన్ని చోట్ల 50 రోజులు ప్రదర్శింపబడటం గమనార్హం. అయితే ఈ సెంటర్లు కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న చోట మాత్రమే సినిమా 50 రోజులు నిలబడగలిగింది.
సెంటర్స్ లిస్ట్
1. ఆధోనీ(సీడెడ్ ఏరియా)
2. ఎమ్మిగనూరు (సీడెడ్ ఏరియా)
3. అనంతపూర్ (సీడెడ్ ఏరియా)
4. చిలకలూరి పేరట (గుంటూరు ఏరియా)
5. నెల్లూరు టౌన్
ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.
ప్రస్తుతం ప్రబాస్ 'మిర్చి' చిత్రంలో నటిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొదుతున్న 'మిర్చి' చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈచిత్రం తర్వాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో నటించనున్నాడు.


Click it and Unblock the Notifications











