ప్రభాస్ ‘రెబల్’ ఆడియో సెప్టెంబర్ 14న
హైదరాబాద్: 'మిస్టర్ పర్ ఫెక్ట్'తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాంచనతో సూపర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబెల్' ఆడియో సెప్టెంబర్ 14న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ...'ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్‌లో హై టెక్నికల్ వేల్యూస్‌తో స్టైలిష్ మూవీగా తెరకెక్కుతున్న 'రెబల్' ఆడియోను సెప్టెంబర్ 14న చాలా గ్రాండ్ గా రిజీజ్ చేయబోతున్నాం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మా బేనర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. అభిమానులు ప్రభాస్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్‌ని ప్రభాస్ చాలా ఎక్స్ లెంట్‌గా చేస్తున్నారు. రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాల స్థాయిలో అద్భుతంగా తీస్తున్నారు. అన్ని ఎక్స్ పెక్టేషన్స్ కు ధీటుగా ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న 'రెబల్' చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'రెబల్' చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











