'రెబల్'2 కోట్ల ఫ్లాష్ బ్యాక్ సీక్రెట్
ప్రభాస్ తాజా చిత్రం'రెబల్'లో రెండు కోట్ల విలువ చేసే ప్లాష్ బ్యాక్ ఉన్నట్లు నిర్మాతలు తెలియచేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ ప్లాష్ బ్యాక్ కు అంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నదానికి నిర్మాతలు సమాధానమస్త్తూ.. "రూ.2 కోట్ల వ్యయంతో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని 15 రోజుల పాటు శంషాబాద్‌లో షూట్ చేసాం. 25 లక్షల రూపాయలతో భారీ సెట్ వేసి, 20 అడుగుల కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించాం. కృష్ణంరాజు, ప్రభాస్, దీక్షాసేథ్, ప్రభ, ముఖేష్ రుషి, సుప్రీత్‌లతో పాటు 100 మంది ఫైటర్లు, 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల మీద ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని భారీగా చిత్రీకరించాం. సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. సినిమాకు హైలైట్ అవుతుంది''అన్నారు. అలాగే...ఈ చిత్రం విశేషాలు చెపుతూ... ఈ నెల 16 నుంచి ఓ షెడ్యూల్, ప్రారంభమవుతుంది. 29 నుంచి 15 రోజుల పాటు క్లైమాక్స్ సన్నివేశాల్ని పెద్ద ఎత్తున ప్లాన్ చేశాం. దాని తర్వాత రెండు పాటల్ని ఫారిన్‌లో, ఓ పాటను భారీ సెట్స్‌లో చిత్రీకరిస్తాం. ఏప్రిల్ ఆఖరుకు షూటింగ్ పూర్తవుతుంది. రూ.40కోట్లతో ప్రభాస్ కెరీర్‌లోనే హై బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న 'రెబల్'ను జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతోంది.ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ-స్క్రీన్‌ప్లే-సంగీతం-నృత్యాలు-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











