లారెన్స్ కారణంగా ప్రభాస్ ‘రెబెల్’ వాయిదా..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాబోయే చిత్రం 'రెబెల్" వచ్చే వేసవికి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అనుష్క కారణంగా కొన్ని రోజులు వాయిదాపడ్డ ఈ సినిమా షూటింగ్ ఆ స్థానంలో తమన్నా ఎంటర్ అవడంతో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే ప్రస్తుతం నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 2012లో విడుదల చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఆ మేరకే షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ఈ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ కొన్ని వారాలపాటు అనారోగ్యంతో ఉన్న కారణంగానే ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిందంటూ గత రెండు మూడు రోజుల నుండి పలు వెబ్ సైట్స్ లో వార్తలు షికారు చేస్తున్నాయి. లారెన్స్ పూర్తిగా కోలుకోవటంతో ఈ సినిమా వేసవిలో తెరపైకి వస్తుందని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ , తమన్న మరియు దీక్ష సేథ్ ప్రధాన తారాగణం.'రెబల్" చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. కెల్లీ దోర్జీ, షాయాజీ షిండే, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు, బ్రహ్మానందం, ఆలీ మరియు ఎంఎస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











