For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రెబల్’ మూవీ... యూఎస్ బాక్సాఫీస్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రెబల్' చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోటీగా పెద్ద కమర్షియల్ సినిమాలు ఏమీ లేక పోవడం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీసు కలెక్షన్లు కూడా ఆశా జనకంగానే ఉన్నాయి.

    యూఎస్ బాక్సాఫీసు రిపోర్టు ప్రకారం ఈచిత్రం గడిచిన వీకెండ్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే లిమిటెడ్ స్క్రీన్లలో విడుదల కావడంతో మీడియం బడ్జెట్ సినిమాలైన సుడిగాడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలను కలెక్షన్ల పరంగా అధిగమించ లేక పోయింది.

    రెబల్ చిత్రం ఇక్కడ సెప్టెంబర్ 28న 56 స్క్రీన్లలో విడుదలైంది. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్, తమన్నా, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రం ఫస్ట్ వీకెండ్ లో దాదాపు రూ. 50 లక్షలు వసూలు చేసింది. బాలీవుడ్ ట్రేడ్ అనాలసిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రం యావరేజ్‌గా ఒక్కో స్క్రీన్‌కు $1,662 వసూలు చేసింది.

    ఇంతకు ముందు రిలీజైన నాగార్జున షిరిడి సాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలు ఇప్పటికీ అక్కడ మంచి బిజినెస్ చేస్తున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం థర్డ్ వీకెండ్ లో 10 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ...$5,955 వసూలు చేయగా, ఓవరాల్ గా రూ. 2.22 కోట్లు($4,23,392) రాబట్టింది. ఇక షిరిడి సాయి చిత్రం ఫోర్త్ వీకెండ్‌లో ఒక్కో స్క్రీన్ కు $369 కలెక్షన్ సాధించింది. ఇప్పటి వరకు షిరిడి సాయి చిత్రం టోటల్ 27 రోజుల్లో గా రూ. 1.17 కోట్లు($2,24,027) వసూలు చేసింది.

    English summary
    Prabhas' Rebel, which started with a bang at Tollywood Box Office, has also got good response at the USA Box Office in the first weekend. Although it has performed well on a limited number of screens, it has failed to break the mark set by many medium budget movies like Sudigadu, Life is Beautiful in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X