హాట్ బ్యూటీస్ అనుష్క, దీక్షాసేథ్ లతో ‘రెబల్’ రొమాన్స్...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'మాస్" డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్" రెగ్యులర్ షూటింగ్ మే 21న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతుల మాట్లాడుతూ 'ప్రభాస్ హీరోగా ఓ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించాలన్న మా కోరిక ఈ 'రెబల్" చిత్రంతో నెరవేరుతోంది.
మా దర్శకులు రాఘవ లారెన్స్ ఈ చిత్రం కోసం అద్భుతమైన కథను సిద్దం చేశారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ విని ఎంతగానో ఎక్సైట్ అయ్యారు. భారీ సాంకేతిక విలువలతో రూపొందే ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ అనుష్క, దీక్షాసేథ్ హీరోయిన్స్. ఇంకా బ్రహ్మానందం, ముఖేష్ రుషి, కెల్లీ డార్జ్, షాయాజీ షిండే, ఆలీ, ఎంఎస్ నారాయణా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు 'డార్లింగ్"స్వామి అందిస్తున్నారు. థమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











