ప్రభాస్ ‘రెబెల్’ మరో నెల వాయిదా...
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రెబెల్' చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేద్దామని అనుకున్నప్పటికీ ...తాజాగా ఆగస్టుకు వాయిదా వేశారు. సినిమా షూటింగు లేటవుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈచిత్రం ఫైనల్ షెడ్యూల్ గచ్చిబౌలి ప్రాంతంలో జరుగుతోంది.
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జె భగవాన్, జు పుల్లారావు శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై భారీ బడ్జెట్‌తో మంచి టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ అభిమానుల అభిరుచికి తగిన విధంగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్ టైనర్‌గా ఈచిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.
ఇక ప్రభాస్ క్యారెక్టర్ విషయానికొస్తే...'అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు' అనే కాన్సెప్టుతో ఉంటుంది.
చాన్నాళ్ళ క్రితమే ప్రారంభం అయిన ఈ చిత్రం ఆలస్యం కావడానికి కారణం దర్శకుడు లారెన్సే. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుష్కని అనుకున్నారు అయితే అనుష్కకి లారెన్స్ తో పడక ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. మళ్లీ కొంత కాలానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా గుడ్ బాయ్ చెప్పెసేయ్యటంతో..ఎవరైతే ఏమిటి కాపీ కొట్టటానికి అనుకున్నాడో ఏమో లారెన్స్ మ్యూజిక్ తనే చెయ్యటానికి సిద్దమయ్యాడు. లారెన్స్ ఘన కార్యం వల్ల డేట్స్ ప్రాబ్లం వచ్చి తమన్నా....మహేష్ - సుకుమార్ సినిమా వదులుకోవాల్సి వచ్చింది.
మరో వైపు ప్రభాస్ కూడా రాజమౌళి సినిమాకి తక్కువలో తక్కువ ఒక సంవత్సరం కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఆల్రెడీ కమిట్ అయిన వారధి సినిమా మీద దృష్టి మళ్ళించాడు. ఈ ఆలస్యానికి కారణం..షూటింగ్ స్పాట్ లో లారెన్స్ ప్రవర్తనే అని.. రోజు ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ షూటింగ్ డిలే చేస్తున్నాడని..ఇప్పటికే ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసానని ఇంకా డబ్బులు తెచ్చే పరిస్థితి లేదని ప్రొడ్యూసర్ తెలిసిన వారి దగ్గర నెత్తి నోరు బాదుకుంటున్నాడట పాపం.


Click it and Unblock the Notifications











