ప్రభాస్ కొత్త చిత్రం 'రెబెల్'లేటెస్ట్ ఇన్ఫో
ప్రభాస్ హీరోగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రెబెల్' షూటింగ్ చాలా కాలం క్రిందట లాంచ్ అయిన సంగతి తెలిసిందే.రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 28 నుండి జరగవలసి ఉంది కానీ మిస్టర్ పర్ఫెక్ట్ విజయయాత్రలో ప్రభాస్ బిజీగా ఉండటంతో మే 2కు వాయిదా పడింది. ఈ షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.గతంలో గోపీచంద్ తో 'శంఖం' నిర్మించిన జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారి బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న రెబల్ చిత్రాన్ని లారెన్స్ ప్రతిస్టాత్మకంగా రూపొందించాన్నాడని చెప్తున్నారు.ఇక తొలిసారి ప్రభాస్ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.మిస్టర్ పెర్ఫెక్ట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన ప్రభాస్ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడని తెలుస్తుంది.ప్రభాస్ సరసన అనుష్క, దీక్షా సేథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











