ప్రభాస్ ‘రెబల్’....రివేంజ్ స్టోరీ

By Bojja Kumar

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ రోజు 'రెబల్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే......ఓ గ్రామానికి పెద్ద భూపతి(కృష్ణం రాజు). ఆ ఊర్లో భూపతి చెప్పిందే వేదం. భూపతి కొడుకు రిషి(ప్రభాస్) బెంగుళూరులో ఉండి చదువుకుంటూ ఉంటాడు. అక్కడే దీపాళి(దీక్షాసేథ్)తో ప్రేమలో పడతాడు.

ఆమెను ఇంటికి తీసుకొచ్చి అమ్మాన్నాన్నలను పెళ్లికి ఒప్పిస్తాడు రిషి. స్థానిక ఎమ్మెల్యే(ప్రదీప్ రావత్) భూపతితో గొడవ పడి అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. దీనికి భూపతి తమ్ముడు(ముఖేష్ రిషి) సహకరిస్తాడు. సమయం చూసి రిషి లేనప్పుడు అతని తండ్రి భూపతిని, లక్ష్మి చంపేస్తాడు. ఈ సమయంలో వారి వెంట ఉన్న దీపాళిని కూడా చంపేస్తారు.

దీంతో రెబల్ గా మారిన రిషి....తన తండ్రి చావుకు కారణమైన చిన్నన్నను వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. స్టీఫెన్, రాబర్ట్ అనే అండర్ వరల్డ్ డాన్స్ తన తండ్రిని చంపాడని గ్రహించి వారి కోసం వెతుకుతుంటాడు. అయితే వారి ముఖాలు మాత్రం అనుచరులతో పాటు ఎవరికీ కనిపించవు. నానుకు మాత్రమే వారు తెలుసు. నానుకు దగ్గర కావడానికి నాను కూతురు నందిని(తమన్నా)ను లవ్ చేస్తాడు రెబల్. నందిని ద్వారా రెబల్ వారి ఆచూకి ఎలా తెలుసుకున్నాడు? స్టీఫెన్, రాబర్ట్ ఎవరు? అనేది మిగతా కథ.

ప్రభాస్ సరసన తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X