ప్రభాస్ ‘రెబల్’ పని ముగిసినట్లే...

By Bojja Kumar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'రెబెల్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మార్చిన 12తో షూటింగ్ పార్టు మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ నెల 23వ నుంచి శంషాబాద్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది.

పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. జె. భగవాన్, జె.పుల్లారావు శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే...తొలుత ఈ చిత్రానికి తమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ తమన్ ఈ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. ఇప్పడు సంగీత దర్శకుడి బాధ్యతలు, కొరియోగ్రాఫర్ బాధ్యతలు కూడా లారెన్సే నిర్వహిస్తున్నాడు. తమన్నా, దీక్షా సేథ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X