twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ ‘రెబల్’ బ్యాంకాక్ షెడ్యూల్ ఎత్తివేత

    By Bojja Kumar
    |

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రెబల్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి షెడ్యూల్ గత కొన్ని రోజులుగా బ్యాంకాక్ లో జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం షూటింగ్ పూర్తి కావడంతో షెడ్యూల్ ఎత్తివేశారు. యూనిట్ సభ్యులంతా అన్ని సర్దుకుని భారత్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. జనవరి 12 కల్లా అంతా హైదరాబాద్ చేరుకుని సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగి తేలనున్నారు. ఇన్ని రోజులు ఇక్కడ పలు కీలక యాక్షన్ సన్ని వేశాలు చిత్రీకరించారు.

    దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రభాస్ ఇమేజ్ కు తగిన విధంగా 'రెబల్' సినిమాను స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. తమన్నా, దీక్ష సేథ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె. భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 23న 'రెబల్' సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Prabhas Rebel schedule has begun long back and is coming to an end by January12. The unit members of Rebel will come back shortly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X