నన్ను పెళ్లి చేసుకో.... ప్రభాస్‌కు పెళ్లి ప్రపోజల్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తన 38వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ జరుపుకున్న మొదటి పుట్టినరోజు. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి మాట్లాడుకుంటే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తన 38వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ జరుపుకున్న మొదటి పుట్టినరోజు. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి మాట్లాడుకుంటే... బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవాలి.
బాహుబలి సినిమా ముందు వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ప్రభాస్ ఫాలోయింగ్... ఈ సినిమా తర్వాత నేషనల్ వైడ్ విస్తరించింది. ప్రభాస్ అంటే పడిచచ్చిపోయే అమ్మాయిల సంఖ్య కూడా బాగా పెరిగింది. ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ లైఫ్ లో ఉండటం కూడా అమ్మాయిలు ఆయనపై మనసు పారేసుకోవడానికి ప్రధాన కారణం.

వెల్లువెత్తిన మ్యారేజ్ ప్రపోజల్స్
ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నన్ను పెళ్లి చేసుకోవాలంటూ చాలా మంది అమ్మాయిల నుండి ప్రపోజల్స్ వచ్చాయట. కేవలం ఇండియా నుండే కాదు, విదేశాల్లో ఉండే ఇండియన్ అమ్మాయిల నుండి కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయట. ప్రపోజ్ చేసిన వారి సంఖ్య వేలల్లో ఉందని, గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి ఇన్ని ప్రపోజల్స్ రావడంతో ప్రభాస్ సైతం ఆశ్చర్యపోయాడని టాక్.

పెళ్లి ఎప్పుడో...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఆయన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా అభిమానులు ఆరాట పడుతున్నారు. మరో రెండేళ్లలో ప్రభాస్ 40వ వడిలో పడనున్న నేపథ్యంలో ఆయన ఈ లోపే పెళ్లి చేసుకుంటే బావుంటుందని అభిమానుల తపన.

కనీసం ఆలోచన కూడా చేయని ప్రభాస్
పెళ్లి విషయంలో ప్రభాస్ కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని మీడియా ప్రశ్నిస్తే... ఏమో ఆ విషయం నాకే తెలియదు, మీకెలా చెప్పగలను అంటూ గడుసుగా సమాధానం ఇస్తున్నాడు.

సినిమాలతో బిజీ బిజీ
బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ ఆ సినిమా ముగిసిన వెంటనే ‘సాహో' సినిమా ప్రాజెక్టులో బిజీ అయిపోయాడు. ఇలా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ పెళ్లి ప్రపోజల్స్ నుండి తెలివిగా ఎస్కేప్ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











