Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
చావుకైనా సిద్ధమంటున్న ప్రభాస్.. దేవుడిపైనే దర్శకుడి భారం.. సాహోలో ఏం జరుగుతున్నదంటే..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కోసం కొన్ని యాక్షన్ సీన్లను ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే యాక్షన్ సీన్లలో ప్రభాస్ ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడినట్టు తెలుస్తున్నది. ప్రభాస్ దూకుడు చూసి టెన్షన్‌లో పడుతున్నట్టు స్వయంగా దర్శకుడు సుజిత్ రెడ్డి చెప్పడం గమనార్హం.
Recommended Video


డూప్ లేకుండానే
సాహో చిత్రంలో ఎలాంటి సీన్లలో నటించడానికి కూడా ప్రభాస్ డూప్ ఉపయోగించడం లేదు. అందుకు కారణం అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నందున మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. కానీ అతని దూకుడు చూస్తే భయమేస్తున్నది. గతంలో ప్రభాస్ షూటింగ్‌లో గాయపడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

గతంలో గాయపడిన బాహుబలి
బాహుబలి చిత్ర సమయంలో యాక్షన్ సీన్లలో ప్రభాస్ గాయపడ్డాడు. దాంతో ఆయనకు సర్జరీ కూడా జరిగింది. అలాంటిది మళ్లీ జరుగకూడదు అని భగవంతుడిని వేడుకొంటున్నాను. సాహోలో చాలా రకాల యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. ఏ సీన్‌లో ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతున్నది అని సుజిత్ చెప్పారు.

సాహోలో అండర్ వాటర్ ఫైట్స్
సాహో చిత్రంలో అండర్ వాటర్ ఫైట్స్ కూడా ఉన్నాయి. దీని కోసం ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆ శిక్షణ కోసం వెళ్లాల్సి ఉంటుంది. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తాడు అని సుజిత్ అన్నారు.

దుబాయ్‌లో చేజింగ్ సీన్స్
తదుపరి షెడ్యూల్‌లో దుబాయ్‌లో చేజింగ్ సీన్లు తీసేందుకు సాహో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. ఇందుకోసం దుబాయ్ ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకొన్నది. త్వరలోనే అనుమతి లభిస్తే బుర్జ్ ఖలీఫా, దుబాయ్‌లోని వివిధ ప్రదేశాల్లో షూట్ చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

బుర్జ్ ఖలీఫా వద్ద షూటింగ్
ఒకవేళ బుర్జ్ ఖలీఫా వద్ద షూటింగ్‌కు అనుమతి లభించకపోతే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద షూటింగ్ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నారు. దాదాపు 20 నిమిషాలపాటు ఉండే చేజింగ్ సీక్వెన్స్ కోసం ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్స్ రెడీ అవుతున్నారు.

కెన్నీ బేట్స్ స్టంట్స్
సాహోలో యాక్షన్ సీన్లను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించడానికి ట్రాన్స్‌ఫార్మర్, డై హార్డ్ చిత్రాలకు పనిచేసిన కెన్నీ బేట్స్ స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. హై ఓల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌ను జాగ్రత్తగా షూట్ చేసేందుకు ప్రభాస్‌ను మానసికంగా సిద్దం చేస్తున్నట్టు సమాచారం.

పునర్జన్మ కథ నేపథ్యంగా
కాగా, సాహో చిత్రానికి సంబంధించిన కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. పునర్జన్మ కథా నేపథ్యంగా ఈ చిత్రం రూపొందుతున్నది. బ్రిటీష్ కాలం నాటి ఒక ఎపిసోడ్, ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కథ సాగడం సాహో చిత్ర కథ అని చెప్పకొంటున్నారు.

బారీగా బాలీవుడ్ నటులు
దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సాహో చిత్రంలో భారీ సంఖ్యలో బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. బాహుబలి తర్వాత జాతీయ స్థాయి చిత్రంగా సాహోను మలిచేందుకు దర్శకుడు సుజిత్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మహేశ్ మంజ్రేకర్, మందిరాబేడి, చంకీ పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందున్నది.