మరో బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ప్రభాస్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం నాలుగు ఇంట్రెస్టింగ్ సినిమాలను లైన్ లో పెట్టిన రెబల్ స్టార్ త్వరలోనే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో టాక్ కూడా వైరల్ గా మారింది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒక ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తో ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రీసెంట్ గా సాజిద్ అనే బడా ప్రొడ్యూసర్ మరోసారి ప్రభాస్ ను కలిసి ఒక యాక్షన్ సినిమాపై చర్చలు జరిపినట్లు టాక్ వచ్చింది. అయితే కథ నచ్చకపోవడంతో ప్రభాస్ రిజెక్ట్ చేశాడట.

ప్రభాస్ కు ప్రస్తుతం ఒక్క సినిమాకు 100కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే ఈ స్టార్ హీరో మాత్రం తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆదిపూరుష్ తో పాటు సలార్ సినిమా షూటింగ్ పనులను కొనసాగిస్తున్న డార్లింగ్ మరికొన్ని నెలల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











