»   » కారణం ప్రభాసేనా? 4 రోజుల షూటింగ్ తర్వాత రకుల్ ఔట్!

కారణం ప్రభాసేనా? 4 రోజుల షూటింగ్ తర్వాత రకుల్ ఔట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో మంచి జోరు మీద ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అమ్మడు టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. రామ్ చరణ్, రవితే, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ ఈ స్టేజికి అంత ఈజీగా ఏమీరాలేదు. ఈ స్థాయిని అందుకోవడానికి ఆమె ఎంతో కష్టపడింది. గతంలో కొన్ని చీత్కారాలు కూడా ఎదుర్కొంది. గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన ఆమెను నాలుగు రోజుల షూటింగ్ అనంతరం తీసేసారట. ఈ విషయాన్ని ఇటీవల ఆమె స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్' చిత్రంలో తాప్సీ పాత్రకు తొలుత రకుల్ ను తీసుకున్నారు. ఏమైందో తెలియదు కానీ తీసేసారు. అప్పట్లో ప్రభాస్ సూచన మేరకు ఆమెను మార్చినట్లు టాక్.

Prabhas Rejected Rakul Preet Singh?

ఇలా ఎన్నో అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ పక్కా ప్లానింగ్ ప్రకారం తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతూ వచ్చింది. ఇటు తెలుగుతో పాటు హిందీ సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘సిమ్లా మిర్చి' చిత్రం చేస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ కు జోడీగా సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో' సినిమాలో నటిస్తోంది.

మరో వైపు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ‘బ్రూస్ లీ' చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. రామ్ చరణ్ హీరో కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం కావడంతో ఈ సినిమా హిట్టయితే తన కెరీర్ మరింత బావుంటుందని ఆశ పడుతోంది. ఆల్ ది బెస్ట్ రకుల్...!

English summary
"Rakul Preet Singh roped for second heroine role in Mr Perfect. For reasons known to Prabhas and Dil Raju, the replaced her with Taapsee after 4 days of shoot", a source said. But now, even four days of Rakul is quite important for any big producer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu