రాజమౌళి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమే: స్టార్ హీరో...!
ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" చేస్తున్న ప్రభాస్ రాజమౌళి తో చేయబోయే సినిమా కోసం ఒక సంవత్సరం డేట్స్ ఇచ్చేశాడు. అయితే లారెన్స్ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న 'రెబల్" తర్వాత రాజమౌళి సినిమా సెట్స్ కి వెళుతుంది. ఈలోపు చాలా మంది నిర్మాతలు ప్రభాస్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ, ఎవరికీ అతను కమిట్ కావడంలేదు. తనతో సినిమా చేయ్యాలనుకునే నిర్మాతలకు రాజమౌళి సినిమా పూర్తి కావడానికి సంవత్సరం పట్టొచ్చు, సంవత్సరంన్నర పట్టొచ్చు అప్పటి వరకు నేను వేరే సినిమా ఏదీ కమిట్ అవ్వదలుచుకోలేదు అని చెప్తున్నాడు ప్రభాస్.
కొత్త కథలు కూడా వినడానికి నిరాకరిస్తున్నాడు. దీన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే తనని ఛత్రపతి తో హీరోగా హైట్స్ కి తీసుకెళ్లిన రాజమౌళి కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా ప్రభాస్ సిద్దపడుతున్నాడు. ఛత్రపతి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి నానా తంటాలు పడుతున్న ప్రభాస్ కి మరో బ్లాక్ బస్టర్ కావాలి. అందుకే ఎవరి సినిమా అయినా రిజెక్ట్ చేస్తున్నాడు..


Click it and Unblock the Notifications











