twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Good Luck Sakhi Teaser చలాకీ ‘సఖి’.. మరోసారి కీర్తి నట విశ్వరూపం!!

    |

    మహానటి కీర్తి సురేష్ మరోసారి తన నటననతో అందర్నీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెంగ్విన్ సినిమాతో లాక్డౌన్ కాలంలో అందర్నీ ఆకట్టుకుంది. సినిమా అంతగా వర్కౌట్ కాకపోయిన కీర్తి సురేష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇక మహానటి తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో నటించి మెప్పించేందుకు సఖిగా మన ముందుకు రాబోతోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది. అయితే నేటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.

    Recommended Video

    Good Luck Sakhi Teaser | Prabhas Released Keerthy Suresh's గుడ్ లక్ సఖి తెలుగు టీజర్!! || Oneindia
    పోస్టర్ వైరల్..

    పోస్టర్ వైరల్..

    రెండ్రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. పల్లెటూరి పిల్లలా కీర్తి సురేష్ తన్మయత్వానికి గురవుతూ ఆనందంలో మునిగిపోతోన్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా అందర్నీ ఆకట్టుకుంది. ఇక కాసేపటి క్రితం విడుదల చేసిన గుడ్ లక్ సఖి టీజర్ అందర్నీ ఫిదా చేసేస్తోంది.

    ప్రభాస్ చేతుల మీదుగా..

    ప్రభాస్ చేతుల మీదుగా..


    తమిళ, తెలుగు, మలయాళి భాషల్లో రిలీజ్ చేయబోతోన్న గుడ్ లక్ సఖి టీజర్ విడుదలైంది. ఈ సినిమా టీజర్‌ను తెలుగులో ప్రభాస్, తమిళంలో విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఇందులో కీర్తి సురేష్ నటనే ప్రధాన ఆకర్షణగా నిలిచేట్టు కనిపిస్తోంది. సఖి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టినట్టు కనిపిస్తోంది.

    అల్లరి పిల్లగా..

    అల్లరి పిల్లగా..

    బ్యాడ్ లక్‌ను వెంటేసుకుని తిరిగే సఖి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉండోబోతోందని తెలుస్తోంది. పెళ్లి చేసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు కూడా మధ్యలోనే వెనుదిగిరే అంత దురదృష్టాన్ని వెంట వేసుకుని తిరిగే సఖి పాత్రలో కీర్తి సూపర్‌‌గా నటించింది.

    స్పెషల్ అట్రాక్షన్‌..

    ఇక కీర్తి గెటప్, భాష, యాస అన్నీ ప్రత్యేకంగా నిలవబోతోన్నట్టు కనిపిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబుల క్యారెక్టర్స్ మరింత ఆకర్షణగా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. గ్రామీణ స్థాయి సాధారణ అమ్మాయి నుంచి షూటర్‌గా ఎదిగే క్రమంలో కీర్తికి ఎదురైన సంఘటనలు ఆకట్టుకునేలానే ఉన్నాయి. నాగేశ్ కుకునూర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    English summary
    Prabhas Released Keerthy Suresh Good Luck Sakhi Teaser. Sakhi has arrived! Red heart Here comes the teaser for ̷B̷a̷d̷ Good Luck Sakhi ! Red heartSmiling face with smiling eyes Wishing you all a very #HappyIndependenceDay!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X