twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు ఇండియాలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్.. ఒక్కో మూవీకి ఎంత తీసుకుంటారంటే..

    |

    బాహుబలి సంచలన విజయం తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాప్తించింది. ప్రభాస్ నటించే ప్రతీ సినిమా పాన్ ఇండియా మూవీగా మారుతున్నది. ఈ క్రమంలో ఆయన సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ప్రతీ సినిమాకు ప్రభాస్ తీసుకొనే రెమ్యునరేషన్ గురించి జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం....

    షర్ట్ విప్పేసి అందాల విందు.. సాక్షి అగర్వాల్ రచ్చ

     సినిమా హిట్టా? ఫట్టా?

    సినిమా హిట్టా? ఫట్టా?

    బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. సినిమా హిట్టా? ఫట్టా అనే విషయాన్ని పట్టించుకోకుండా యంగ్ రెబల్ స్టార్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. సాహో చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినా ఉత్తరాదిలో రికార్డు కలెక్షన్లను వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలకు ఆయన సినిమాలపై మంచి గురి ఏర్పడింది.

    కొంటెచూపుతో కవ్విస్తోంది.. తారా సుతారియా హాట్ పిక్స్

    జూలై 30న రాధేశ్యామ్ రిలీజ్

    జూలై 30న రాధేశ్యామ్ రిలీజ్

    లాక్‌డౌన్‌కు ముందు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు ముస్తాబువుతున్నది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ క్యారెక్టర్‌ను పోషించారు. డార్లింగ్, మిర్చి తర్వాత పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రంలో నటించడం గమనార్హం. ఈ సినిమా 2021 జూలై 30 తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

    ఆదిపురుష్, సలార్, ప్రభాస్21 చిత్రాలకు

    ఆదిపురుష్, సలార్, ప్రభాస్21 చిత్రాలకు

    ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్ తర్వాత ప్రభాస్ సినిమాల ఎంపిక జోరందుకొన్నది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా పక్కన పెడితే.. ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ రూపొందించే చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందనున్నాయి. ఈ సినిమాలను దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేయడానికి ఆయన చిత్ర యూనిట్లు ప్లాన్ చేస్తున్నాయి.

    చిరునవ్వే విసిరావే.. ఎవ్లీన్ శర్మ పిక్స్ వైరల్

    ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం

    ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం

    ట్రేడ్, సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ తన సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్టు తెలిసింది. అయితే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకుపైగానే పారితోషికాన్ని తీసుకొంటున్నట్టు సమాచారం. ఇండియాలో ఏ హీరోకు కూడా ఇంత రెమ్యునరేషన్ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    రూ.100 కోట్ల క్లబ్‌లో తొలి హీరోగా

    రూ.100 కోట్ల క్లబ్‌లో తొలి హీరోగా

    హీరోలకు సంబంధించిన రెమ్యునరేషన్ విషయంలో మొట్టమొదటిసారి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ క్లబ్‌ను ప్రారంభించిన ఘనత ప్రభాస్‌కు దక్కిందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. సల్మాన్, షారుక్, రణ్‌వీర్ సింగ్ లాంటి హీరోల కంటే ప్రభాస్‌ ఎక్కువ రెమ్యురేషన్ అందుకొంటున్నట్టు జాతీయ వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొన్నది.

    English summary
    Baahubali star Prabhas remuneration becomes talk of Indian film Industry. Young rebel star charges for Adipurush more than any other bollywood hero. Reports suggest that, Prabhas is taking Rs.100 crores per movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X