బాలీవుడ్ హీరోకి షాక్: ప్రభాస్‌పై రాజమౌళి మనసు మారిందా?

ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం....‘ ప్రస్తుతం సాహో సినిమా షూటింగుకు సిద్ధమైన ప్రభాస్...ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

By Bojja Kumar

హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్-అనుష్క జోడి ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ ఫేవరెట్ జోడీ అయిపోయింది. మరో వైపు ప్రభాస్-రాజమౌళి మోస్ట్ లవబుల్ యాక్టర్-డైరెక్టర్ ద్వయంగా ముద్దపడింది.

ఇంకా మీరు బాహుబలి-2 హ్యాంగోవర్లోనే ఉండి ఉంటే ఈ వార్త మీకోసమే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... ప్రభాస్, రాజమౌళి కలిసి మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.

ప్రభాస్-రాజమౌళి చర్చలు

ప్రభాస్-రాజమౌళి చర్చలు

ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం....‘ ప్రస్తుతం సాహో సినిమా షూటింగుకు సిద్ధమైన ప్రభాస్...ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే

త్వరలోనే

ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా విషయం ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ రానుందని తెలుస్తోంది.

మొదట రణవీర్ తో చేయాలనుకున్న రాజమౌళి

మొదట రణవీర్ తో చేయాలనుకున్న రాజమౌళి

ఆ మధ్య రాజమౌళి గురించి బాలీవుడ్లో కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో ఆయన సినిమా చేయబోతున్నట్లు ఆ రూమర్స్ సారాంశం.

వచ్చే ఏడాది...

వచ్చే ఏడాది...

ప్రస్తుతానికైతే రాజమౌళి తన తర్వాతి సినిమా ఏమిటనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఏ సినిమా అనేది ఆయన డిసైడ్ అయి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయి సెట్స్ మీదకు వచ్చే ఏడాది వస్తుందని అంటున్నారు.

బాజీరావు మస్తానీ చూసి ఫిదా అయిన రాజమౌళి

బాజీరావు మస్తానీ చూసి ఫిదా అయిన రాజమౌళి

బాజీరావ్ మస్తానీ మూవీలో రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి..... ఆయనతో సినిమా చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాడట. బాహుబలి పూర్తవ్వగానే బాలీవుడ్లో రణవీర్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నారట.

రాజమౌళి మనసు మారిందా?

రాజమౌళి మనసు మారిందా?

అయితే ఇపుడు రాజమౌళి మనసు మారిందని.... రణవీర్ కంటే ఇపుడు ప్రభాసే బాగా పాపులర్ కావడం, పైగా ప్రభాస్ అయితే తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో రణవీర్ తో సినిమా చేయాలనే ఆలోచన పక్కన పెట్టి ప్రభాస్ తో చేయాలనే ప్లాన్ చేసుకుంటున్నాడట.

ప్రభాస్‌తో అయితే అద్భుతాలు చేయొచ్చు

ప్రభాస్‌తో అయితే అద్భుతాలు చేయొచ్చు

ప్రభాస్ హీరోగా సినిమా చేస్తే ఇటు తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంటుంది, బాక్సాఫీసు వద్ద అద్భుతాలు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్.

అనుష్క శెట్టి కూడా?

అనుష్క శెట్టి కూడా?

ప్రభాస్ తో సినిమా ఓకే అయితే అందులో హీరోయిన్ గా అనుష్క శెట్టినే తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అనుష్క, ప్రభాస్ కాంబినేషన్ హిట్ పెయిర్ కావడం వల్ల సినిమాకు కలిసొస్తుందనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X