twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్కతో పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ.. మరో ఏడాది తర్వాతే..

    బాహుబలి2‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకొంటాడనే వార్తలు అప్పట్లో జోరందుకున్నాయి. బాహుబలి

    By Rajababu
    |

    బాహుబలి2‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొన్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకొంటాడనే వార్తలు అప్పట్లో జోరందుకున్నాయి. బాహుబలి తర్వాత సాహో సినిమా దృష్టిపెట్టిన ప్రభాస్.. మరో ఏడాది అగాల్సిందేనని క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ రెబల్‌స్టార్. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అనుష్క‌తో పెళ్లి వార్తలు, ప్రభాస్‌కు పెళ్లి కూతురు కావాలి అని రానా చేసి ప్రకటన, తన పెళ్లిపై ప్రభాస్ వివరణ ఇచ్చాడు.

    అనుష్కతో పెళ్లి అంటూ గాసిప్స్

    అనుష్కతో పెళ్లి అంటూ గాసిప్స్

    బాహుబలి రిలీజ్ తర్వాత అనుష్కతో ప్రభాస్‌ అఫైర్ జోరుగా సాగుతున్నది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారు. అందుకే అనుష్క సినిమాలను అంగీకరించడం లేదు అని మీడియాలో గాసిప్స్ జోరుగా ప్రచారమయ్యాయి. అయితే ఆ రూమర్లపై ప్రభాస్, అనుష్క స్పందించి వాటిని ఖండించారు. అంతేకాకుండా తనపై ఇలాంటి వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటాం అని అనుష్క హెచ్చరించింది.

    Recommended Video

    Prabhas's cousin reacted on Prabhas Marriage Rumours
    అలాంటి వార్తలు తప్పవు..

    అలాంటి వార్తలు తప్పవు..

    అనుష్కతో పెళ్లి, అఫైర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. సినీ సెలబ్రిటీలకు అలాంటి ఇబ్బందులు తప్పవు. అలాంటి రూమర్లు రావడం చాలా సహజం. ఇలాంటి వార్తలు వస్తాయని ముందే ఊహించాను. ఎవరైనా హీరో ఓ హీరోయిన్‌తో వరుసగా రెండు, మూడు సినిమాలు చేస్తే ఇలాంటి గాసిప్స్ రావడం చాలా సహజం అని ప్రభాస్ అన్నారు.

    రూమర్లు వస్తే బాధపడేవాడిని

    రూమర్లు వస్తే బాధపడేవాడిని

    మొదట్లో తనపై ఇలాంటి రూమర్లు వస్తే చాలా బాధపడే వాడిని. ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాయడం సరికాదని బాధపడే వాడిని. ఇప్పుడు అలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు అని ప్రభాస్ పేర్కొన్నారు.

    ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు లేవు..

    ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు లేవు..

    ఇంట్లో పెళ్లి వార్తలు చూస్తున్నారని వస్తున్న విషయంపై ప్రభాస్ స్పందించారు. ఇప్పట్లో అలాంటి పెళ్లి ఆలోచనలు తనకు లేవు. ఇంట్లో వారికి కూడా లేవు. అభిమానులు, ముఖ్యంగా మహిళా అభిమానులు నా పెళ్లి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాపై ఇంత మొత్తంలో అభిమానాన్ని కురిపిస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాను. సాహో చిత్రం తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ప్రభాస్ పేర్కొన్నాడు.

    రానా ప్రకటనపై స్పందించిన బాహుబలి

    రానా ప్రకటనపై స్పందించిన బాహుబలి

    బాహుబలి షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ప్రభాస్‌కు పెళ్లి కూతురు కావాలి అని సోషల్ మీడియాలో రానా దగ్గుబాటి ఇచ్చిన ప్రకటన గురించి ప్రభాస్ చాలా తేలికగా తీసుకొన్నారు. రానా క్రియేటివిటికి ఆ యాడ్ అద్దం పట్టింది. నేను పెళ్లి చేసుకోబోతున్నానని రానాకు చెప్పలేదు. అతడు కూడా అలా చెప్పలేదు. ఏదో సరదాగా రానా చేశాడు అని ప్రభాస్ చెప్పాడు.

    సాహోపైనే దృష్టి..

    సాహోపైనే దృష్టి..

    పలు భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంపైనే ప్రభాస్ దృష్టిపెట్టారు. ఈ చిత్రం రూ.150 కోట్ల వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. యూరప్‌, ముంబై, లండన్, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రం 2018లో విడుదలకు సిద్ధమవుతున్నది.

    English summary
    Young Rebel star Prabhas most eligible bachelor in film industry. He said he is not thinking about his marriage. Prabhas said right now, my fans don’t need to worry. I have no plans for getting married now. I’m not even thinking about it. Now Prabhas is busy with Saaho movie shooting. Sujeet Reddy is directing this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X