ప్రభాస్ రికమండేషన్ తోనే ఆ సెక్సీ హీరోయిన్స్ ఇద్దరూ
ప్రభాస్, దశరధ్ కాంబినేషన్లో మొదలుకానున్న చిత్రానికి తపస్వీ, సారా జైన్ హీరోయిన్స్ గా ఎంపికయినట్లు సమాచారం. వీరిద్దరూ సెక్సీ గా ఉండటంతో ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి వర్కవుట్ అవుతారా అనే సందేహం వచ్చింది. అయితే ప్రభాస్ స్వయంగా వీరిద్దరూ పేర్లు చెప్పారుట. అంతేగాక దిల్ రాజు చెప్పిన ఎస్టాభ్లిషడ్ హీరోయిన్స్ ని వద్దని చెప్పాడని తెలుస్తోంది. ఇక దశరధ్ ఈ హీరోయిన్స్ ఎంపిక విషయంలో నామమాత్రంగానే ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక కథలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఫ్యామిలీలకు నచ్చే ఎలిమెంట్స్ ను ఇమిడ్చారని తెలుస్తోంది. దాదాపు సంవత్సరం పైగానే దశరధ్ ఈ చిత్రం స్క్రిప్టుపై దిల్ రాజు ఆఫీసులో కసరత్తులు చేస్తున్నాడు. తన మొదటి చిత్రం సంతోషంలా ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నాడు. ఇక తపస్వి ప్రస్తుతం మనోజ్ సరసన చేస్తోంది. ప్రభాస్, కరుణాకరన్ కాంబినేషన్లో రెడీ అవుతున్న డార్లింగ్ చిత్రం కూడా షూటింగ్ సగం పూర్తయింది. అలాగే దశరధ్ చిత్రం నవంబర్ 27వతేదీన ప్రారంభం కానుంది.ఇంతకు ముందు దిల్ రాజు, ప్రబాస్ కాంబినేషన్లో మున్నా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











