తెలుగు సినిమా ఇంకా అంత దిగజారలేదు...దీక్షాసేధ్
తెలుగు సినిమా బాలీవుడ్ అంత దిగజారలేదు. టాలీవుడ్‌లో టూపీస్ బికినీలో కనిపించడం కష్టం అంటోంది దీక్షాసేధ్. వేదం చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గోపీచంద్, రవితేజ చిత్రాలు వరసగా చేసేసింది. తాజాగా ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలో బుక్కయింది. ఈ ఆనందంలో ఉన్న ఆమెను మీడియా పలకరించి ఎప్పటిలాగే బికినీ గురించి ప్రశ్నిస్తే ఆమె ఇలా స్పందించింది.అలాగే అందరిలాగే ఆమె బికీనీ గురించి ఒకే పాట పాడింది. అది..కథకు అలా కనిపించడం అవసరమైతే టూపీస్ బికినీ వేస్తా. నటిగా అది నా ధర్మం. ఐతే..సన్నివేశం అనేది గ్లామర్‌గా ఉండాలి కానీ, వల్గర్‌గా ఉండకూడదు. అలా ఉంటేనే బికినీ ధరిస్తా అంది.ఇక ప్రభాస్ ప్రక్కన బుక్కవటం గురించి మాట్లాడుతూ.. "ప్రభాస్‌కు నేను సరిజోడి. మా జంట ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంది. సరైన సమయంలో నాకు వచ్చిన మంచి అవకాశం ఈ సినిమా" అని ఆనందం వ్యక్తం చేశింది.


Click it and Unblock the Notifications











