ఆ ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న ప్రభాస్‌!

By Bojja Kumar

ఒక హీరో...ఇద్దరు హీరోయిన్లు ఉండే సినిమాల్లో హీరోలకు ఎన్ని కష్టాలు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. హీరోయిన్లు సదరు హీరోను తమ అందాలతో నలిపేస్తుంటే, ముద్దు ముచ్చట్లతో హింసిస్తుంటే...ప్రేక్షకులు నయనానందంగా ఫీలవుతుంటారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కోబోతున్నాడు. ఆ ఇద్దరూ ఎవరో కాదు...అనుష్క, రీచా గంగోపాధ్యాయ్. 'బిల్లా"లో ఓ మారు భాస్‌ సరసన నటించిన అనుష్క కి తనతో ఇది రెండో సినిమా. రీచాకి మాత్రం తొలి అవకాశం. ఈ చిత్రానికి రచయిత ఆకుల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో ప్రభాస్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు భామలతో హాట్ హాట్ రొమాన్స్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేయబోతున్నాడని తెలుసో్తంది. నిర్మాత శివ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే శృంగారభరిత మసాలాను ఈ సినిమాలో కలపబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి అందాలను ప్రభాస్ ఎలా తట్టుకుంటాడో ఏమో..?

యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి-ప్రమోద్‌ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తు న్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ 'ప్రభాస్‌ అభిమానుల అంచనాలను అందుకునే కథాంశంతో సినిమా రూపొందిస్తు న్నాం. అన్నివర్గాలను అలరించేలా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళుతున్నాం" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: అరసు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: అశోక్‌ కుమార్‌ రాజు, రచన-దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X