ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్‌డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కెరీర్ ఆరంభంలో ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల్లో నటించిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి వరుసగా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టుల్లోనే నటిస్తున్నాడు. ఒకటి పట్టాలపై ఉండగా మరో మూడు బిగ్ బడ్జెట్ మూవీలను ప్రకటించి షాకిచ్చాడు. ఇందులో భాగంగానే 'ఆదిపురుష్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

తొలిసారి ఆ తరహా సినిమాలో ప్రభాస్

తొలిసారి ఆ తరహా సినిమాలో ప్రభాస్

రెండు పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్.. 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. 1960 దశకం నాటి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రెబెల్ స్టార్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. అలాగే, ఒక్క ఫైట్ కూడా లేకుండా ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది.

మరో రెండు అనౌన్స్ చేసిన రెబెల్ స్టార్

మరో రెండు అనౌన్స్ చేసిన రెబెల్ స్టార్

'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. మరో రెండు ప్రాజెక్టులను సైతం ప్రకటించేశాడు. అందులో ఒకటి 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తాడు. దీన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీనితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్' చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి.

బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరో

బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరో

వరుసగా సినిమాలను ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే ఏకంగా బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతూ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తున్నాడు. టి-సిరీస్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రాబోతుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

రావణుడిగా సీనియర్ హీరో.. వివరాలు

రావణుడిగా సీనియర్ హీరో.. వివరాలు


చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'లో రావణుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.

సీతగా టాల్ బ్యూటీ.. లక్ష్మణుడిగా హీరో

సీతగా టాల్ బ్యూటీ.. లక్ష్మణుడిగా హీరో


రామాయణం నాటి కథతో 'ఆదిపురుష్' రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగానూ, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించనున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతీ సనన్ సీతగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు సన్నీ సింగ్ అనే యంగ్ హీరో లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఆదిపురుష్ నుంచి ఊహించని అప్‌డేట్

ఆదిపురుష్ నుంచి ఊహించని అప్‌డేట్

తాజాగా ఆదిపురుష్ టీమ్ నుంచి ఊహించని అప్‌డేట్ వచ్చింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం మంగళవారం ఉదయం 7.11 గంటలకు ఓ ప్రకటన చేశారు. అందులో దర్శకుడితో పాటు వీఎఫ్ఎక్స్ టీమ్‌ను చూపిస్తూ.. 'ఆదిపురుష్ ప్రపంచాన్ని సృష్టించేందుకు మోషన్ వర్క్ ప్రారంభం అయింది' అని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X