ప్రేమలో ఏది కరెక్ట్?(ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' ప్రివ్యూ)
ప్రభాస్,కాజల్ కాంబినేషన్ లో రూపొందిన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రం ఈ రోజు(శుక్రవారం) విడుదలవుతోంది.ఈ చిత్రంలో ప్రభాస్ విక్కీగా కనిపిస్తాడు. విక్కీ కి మొదటనుంచీ తాను ఏది అనుకుంటే అది చేసేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎప్పుడూ సంతోషంగా హ్యాపీ లైప్ ని లీడ్ చేస్తూంటాడు.ఆ క్రమంలో ప్రియ (కాజల్)తో పరిచయం ఏర్పడుతుంది.ఆమె ప్రేమలో పడతాడు.ఆ ప్రేమ ముందుకు వెళ్ళేలోగా బ్రేక్ అప్ అవుతుంది. ఇంతలోనే ఆస్ట్రేలియా నుంచి మాగీ (తాప్సి) వస్తుంది. అప్పుడు కథ కీలకమైన మలుపు తిరుగుతుంది. ఈ ముగ్గురి చుట్టూ ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి.ఇంతకీ విక్కీ ఎవర్ని పెళ్ళి చేసుకున్నాడు..తరవాత ఏం జరిగిందనేది మిగతా కథ.ఈ చిత్రం గురించి నిర్మాత రాజు మాట్లాడుతూ ''ప్రభాస్ పాత్ర చిత్రణ కొత్తగా ఉంటుంది. వినోదానికి పెద్ద పీట వేశాం. కుటుంబ బంధాల్లోని భావోద్వేగాలు హృదయాన్ని హత్తుకుంటాయి. కాజల్ పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు.
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: ప్రభాస్, కాజల్, తాప్సి, నాజర్, ప్రకాష్‌రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, మాస్టర్‌భరత్, విశ్వనాథ్ కాశీ తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: రాజు
దర్శకత్వం: దశరథ్


Click it and Unblock the Notifications











