twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోబో 2 వల్లే కాలేదు కానీ ప్రభాస్ ఓకే చేసాడు : మరీ ఇంత సాహసం బాహుబలి కాన్పిడెన్సేనా ??

    |

    రెండేళ్లుగా సాగుతున్న 'బాహుబలి' షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం తయారవుతున్నాడు. 'రన్ రాజా రన్' చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. ఈ యువ దర్శకుడు ప్రభాస్ ని ఒక కొత్త అవతారంలో చూపించడానికి తగ్గ కధని ఎంచుకున్నాడు. ఈ కధకి ప్రభాస్ కొన్ని నెలల క్రితం ఓకే చెప్పినట్టు సమాచారం.ప్రస్తుతం బాహుబలి పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా పూర్తి కాగానే ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ హోం ప్రొడక్షన్స్ యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

    తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావస్తున్న ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన త్వరలో నిర్మాతలు ఇవ్వనున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో ప్రారంభంకానుంది. యు వి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ మాత్రం టాలివుడ్ లోనే కల కలం రేపుతోంది. అదేమిటో తెలుసా..?? 150 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో ఒక ఫైట్ ని ఆకాశంలో చిత్రీకరించాలనుకుంటున్నారట. అంతేకాదు ఆ ఫైట్ మొత్తం ఆకాశంలోనే జరుగుతుందని టాక్. ఈ భారీ ఫైట్ కోసం దాదాపు ముప్పయ్ నుంచి నలభై కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారని వార్తలు వస్తున్నాయి. దీని కోసం హాలీవుడ్ చిత్రాలకి పనిచేసిన స్టంట్ మాస్టర్ ని ఇప్పటికే హైర్ చేసుకున్నారని టాక్.

     ప్రభాస్‌-సుజిత్‌ కాంబినేషన్‌లో:

    ప్రభాస్‌-సుజిత్‌ కాంబినేషన్‌లో:


    ‘బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. అందుకే ఆయన తర్వాతి సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా నిర్మాతలు వెనుకాడ్డం లేదు. ‘బాహుబలి-2' తర్వాత ప్రభాస్‌-సుజిత్‌ కాంబినేషన్‌లో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఓ సినిమా నిర్మించనున్న విషయం తెలిసింది.

     బాహుబలి తర్వాత:

    బాహుబలి తర్వాత:


    ఈ సంస్థ ప్రభాస్‌ సొంత మనుషులదే. ఈ సినిమా బడ్జెట్‌ దాదాపు 120 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేసుకుంటున్నారట. బాహుబలి సినిమా తర్వాత వెంటనే ప్రభాస్ మరో వందకోట్లు దాటే భారీ బడ్జెట్ సినిమాలోనే చేయనున్నాడు.

     ఒక్క ఛేజింగ్‌ ఫైట్‌కే :

    ఒక్క ఛేజింగ్‌ ఫైట్‌కే :


    ఇంతవరకూ బాగానే ఉంది కానీ దుబాయ్‌లో చేయబోయే ఒక్క ఛేజింగ్‌ ఫైట్‌కే దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలని డిసైడ్‌ అయిపోయారట. హాలీవుడ్‌లో ‘జేమ్స్‌బాండ్‌' తరహా చిత్రాలకు పనిచేసిన ఓ హాలీవుడ్‌ టెక్నీషియన్‌ను ఈ ఛేజింగ్‌ ఫైట్‌ కోసం రప్పిస్తున్నారట.

     రెమ్యునరేషన్‌కు భయపడి:

    రెమ్యునరేషన్‌కు భయపడి:


    మొదట్లో ఈ టెక్నీషియన్‌నే ‘రోబో-2' కోసం రప్పించాలనుకున్నారు శంకర్‌, రజనీకాంత్‌. అయితే అతని రెమ్యునరేషన్‌కు భయపడి వెనక్కుతగ్గారట. ఎందుకంటే ఆ హాలీవుడ్‌ టెక్నీషియన్‌ మాట్లాడడానికి కూడా డబ్బులు తీసుకుంటాడట.

     దేశవ్యాప్తంగా మార్కెట్‌ ఉంది:

    దేశవ్యాప్తంగా మార్కెట్‌ ఉంది:


    ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా సరే అలాంటి వాడిని తమ సినిమా కోసం తీసుకోవాలని డిసైడ్‌ అయ్యాడట ప్రభాస్‌. దేశవ్యాప్తంగా మార్కెట్‌ ఉంది కాబట్టి.. ఎంత ఖర్చుపెట్టినా వెనక్కి తిరిగి వచ్చేస్తుందన్న నమ్మకమే ప్రభాస్‌ నిర్ణయానికి కారణం. ఇదంతా ‘బాహుబలి' ఇచ్చిన కాన్ఫిడెన్సే కదా!

     మొదట్లో యాభై కోట్ల పెట్టుబడి:

    మొదట్లో యాభై కోట్ల పెట్టుబడి:


    దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు ఇప్పుడు జరుగు తున్నాయని తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాని యాభై కోట్ల పెట్టుబడిలో చేద్దామని అనుకున్నా ప్రభాస్ ప్రస్తుత రేంజ్ రీత్యా ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు నూట యాభై కోట్లకు చేరిన విషయం తెలిసిందే.

     భారీ ప్లాన్స్ :

    భారీ ప్లాన్స్ :


    బాహుబలి తో ప్రభాస్‌ ఎలాగు నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు కాబట్టి ఈ సినిమాను హిందీలో, తమిళంలో, మలయాళంలో విడుదలచేసే విధంగా భారీ ప్లాన్స్ వేస్తూ ఈ సినిమా పై ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి.

     టాలీవుడ్ మొత్తం షాక్ :

    టాలీవుడ్ మొత్తం షాక్ :


    ప్రభాస్ కొత్త సినిమాకోసం ఒక్క ఫైట్ సీన్ కోసం 30-40 కోట్లు ఖర్చు పెడుతున్న వార్తలు బయటకు పొక్కటం తో టాలీవుడ్ మొత్తం షాక్ కి గురయ్యింది... వందల కోట్ల తో నిర్మించే సినిమాల దెబ్బకి చిన్న సినిమాల పరిస్థితి ఏం అవనుందో అన్న మాటలు కూడా వినపడుతున్నాయి...

     స్కై ఫైట్:

    స్కై ఫైట్:


    ఎందుకింత బడ్జెట్ అనుకుంటున్నారా.. ఎందుకంటే ఈ ఫైట్ రూపొందించబోయేది నేల పైనో, నీటి పైనో కాదు గాలిలో. దీన్నే స్కై ఫైట్ అంటారట. ఒకవేళ ఈ వార్త నిజమై ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో స్కై ఫైట్ గనుక ఉంటే అభిమానులకు కనులవిందేనని చెప్పొచ్చు.

     యువీ క్రియేషన్స్ బ్యానర్ :

    యువీ క్రియేషన్స్ బ్యానర్ :


    ‘బాహుబలి' సిరీస్ తో ప్రభాస్ కు అంతర్జాతీయ మార్కెట్ బాగా పెరగడం వలన నిర్మాతలు చాలా మంది ప్రభాస్ పై భారీ బడ్జెట్ పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. ఇకపోతే ఈ ప్రాజెక్టును యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన ప్రమోద్, వంశీ లు నిర్మించనున్నారు.

    English summary
    As per the latest update, Action Episodes in Sujeeth's movie have been planned on a grand scale as there will be huge expectations on Prabhas after 'Baahubali'. For a single action sequence to be shot in the Sky, A budget of Rs 30 crore has been allotted. A Hollywood Action Choreographer is being hired to film this action part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X