ప్రేమ కోసం వాడు చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు.. క్రేజీగా ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ కూడా!

కృష్ణంరాజు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్‌తో యూనివర్శల్ స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

కెరీర్‌లో మొదటిసారి అలాంటి సినిమాలో

కెరీర్‌లో మొదటిసారి అలాంటి సినిమాలో

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందీ సినిమా.

రెండేళ్లకు పైగానే.. చాలా బ్యాలెన్స్ ఉంది

రెండేళ్లకు పైగానే.. చాలా బ్యాలెన్స్ ఉంది

టాలీవుడ్‌లో మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమా అంటేనే రెండు మూడేళ్లు పడుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తవలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో సినిమా విడుదలపై ఆ ప్రభావం పడుతోంది.

ప్రభాస్ అభిమానులకు ప్రేమికులరోజు గిఫ్ట్

ప్రభాస్ అభిమానులకు ప్రేమికులరోజు గిఫ్ట్

'రాధే శ్యామ్' నుంచి సరైన అప్‌డేట్స్ రాకపోవడంపై యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ప్రీ టీజర్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఐదు భాషల్లో వచ్చిన రాధే శ్యామ్ టీజర్

ఐదు భాషల్లో వచ్చిన రాధే శ్యామ్ టీజర్

ముందుగా ప్రకటించినట్లుగానే ఆదివారం ఉదయం 9.18 గంటలకు 'రాధే శ్యామ్' టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో దీన్ని వదిలారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో, హీరోయిన్లు కనిపించిన తీరు.. బ్యాగ్రౌండ్ స్కోర్.. విజువల్స్ అదగరొట్టేశాయనే చెప్పాలి.

ప్రేమ కోసం వాడు చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు

ఇక, ఈ టీజర్‌లో హీరోను ఉద్దేశించి హీరోయిన్ ఫూజా హెగ్డే 'నువ్వేమైనా రోమియోవి అనుకుంటున్నావా' అని అంటుంది. దీనికి ప్రభాస్.. 'ప్రేమ కోసం వాడు చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు' అంటూ క్రేజీగా బదులిచ్చాడు. దీంతో ఈ ఒక్క డైలాగ్‌తోనే సినిమా ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో అర్థం అయిపోతోంది. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు లుక్స్ అద్భుతంగా ఉన్నాయి.

Recommended Video

Radhe Shyam Teaser Update : Prabhas స్టైలింగ్ కి ఫ్యాన్స్ ఫిదా
‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు

సంక్రాతి తర్వాత తెలుగు సినిమాల రిలీజ్ డేట్లు ఒక్కొక్కటిగా వెలువడ్డాయి. కానీ, 'రాధే శ్యామ్' విడుదల తేదీపై మాత్రం చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన టీజర్‌లో ఈ సినిమాను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో యంగ్ రెబెల్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X