‘రాధే శ్యామ్’ నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్: రొమాంటిక్‌గా మంచులో ప్రభాస్ - పూజా హెగ్డే
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సినిమా విడుదలపై ఆ ప్రభావం భారీగా పడింది. ఇక, ఇటీవల రిలీజ్ డేట్‌ను ప్రకటించడంతో పాటు ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ పోస్టర్‌ను వదిలి సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్.
మార్చి 11న మహా శివరాత్రి పర్వదినం. దీన్ని పురస్కరించుకుని 'రాధే శ్యామ్' యూనిట్ ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో వ్యతిరేక దిశల్లో పడుకుని కనిపిస్తున్నారు. ఇద్దరూ ఆకాశం వైపు చూస్తున్న ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీన్ని కూడా ఐదు రకాల భాషలతో విడుదల చేశారు. ఈ ఫొటోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే, ఈ సడన్ సర్‌ప్రైజ్‌కు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం జూలై 30న విడుదల కాబోతున్నట్లు కూడా పోస్టర్‌లో ప్రకటించారు.

ప్రభాస్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందీ సినిమా. ఇందులో ప్రభాస్ పాత కాలం నాటి కార్లను దొంగిలించే వ్యక్తిగా కనిపిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, జర్మనీ నేపథ్యంతో సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











