Radhe Shyam: ప్రభాస్ మూవీకి అన్ని వందల కోట్ల ఆఫర్: అందులోనే రిలీజ్ చేస్తామన్న డైరెక్టర్
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'బాహుబలి'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, అప్పటి నుంచి ఈ టాల్ హీరో.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో ఈ సినిమా తర్వాత అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనే చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే 'సాహో'తో అన్ని భాషల ప్రేక్షకులనూ అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరిన్ని చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే మూవీ చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

రాధే శ్యామ్‌గా వస్తున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

అంచనాలకు తగ్గట్లు బిజినెస్
ఆరంభం నుంచి ‘రాధే శ్యామ్' అప్‌డేట్లు అంతగా రాలేదు. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రైలర్‌తోనే నేషనల్ రికార్డ్స్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘రాధే శ్యామ్' మూవీ నుంచి కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రభాస్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో తెలుగులో ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్‌గా ఇది రికార్డు సాధించింది. అంతేకాదు, ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది.

మరోసారి వాయిదా పడ్డ మూవీ
రొమాంటిక్ థ్రిల్లర్‌గా ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతోన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు. విడుదలకు పది రోజుల ముందే అధికారికంగా ప్రకటించారు. అయితే, మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

రిలీజ్ అయ్యేది అప్పుడేనని
భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘రాధే శ్యామ్' మూవీ వాయిదా పడడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా నిరాశగా ఉన్నారు. దీంతో ఇది ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను మార్చి నెలలోనే విడుదల చేస్తారని అంటున్నారు.
Recommended Video

సినిమా అందులోనే విడుదల
‘రాధే శ్యామ్' మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా ఓ ఛానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘రాధే శ్యామ్‌కు ఓటీటీ ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమే. అలా అని అందులో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులను మోసం చేసినట్లే అవుతుంది. అందుకే ఎంత ఆలస్యం అయినా సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.


Click it and Unblock the Notifications











