»   » ప్రభాస్ ప్లాప్ సినిమాకు ఊహించని రెస్పాన్స్!

ప్రభాస్ ప్లాప్ సినిమాకు ఊహించని రెస్పాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమాలకు ఆదాయం కేవలం థియేటర్లలో ప్రదర్శన వల్ల మాత్రమే వచ్చేవి. అయితే టీవీ, ఇంటర్నెట్ వినియోగం తర్వాత వీటి రైట్స్ అమ్మడం ద్వారా కూడా నిర్మాతలకు మంచి ఆదాయం వస్తోంది. తెలుగు హీరోల సినిమాలన్నీ ఇతర బాషల్లోకి అనువాదం అయి అక్కడ కూడా టీవీ, ఇంటర్నెట్ లలో విడుదల చేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల పాత సినిమాలు హిందీలో ఈ మధ్య రిలీజ్ చేయడం బాగా పెరిగింది. ఇక్కడ ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం హిందీలో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ అట్టర్ ఫ్లాప్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా'కు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. జూ ఎన్టీఆర్‌కు కూడా హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందనడానికి ఇదొక నిదర్శనం.

Prabhas's “Rebel” gets 1 Cr views

ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రభాస్ కెరీర్లో భారీ డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న ‘రెబల్' సినిమా తాజాగా హిందీలో సంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబులో విడుదల చేయగా ఏకంగా కోటి మంది చూసారు. సౌత్ ఇండియాలో మరే సినిమాకు కూడా యూట్యూబ్ లో కోటి వ్యూస్ ఇప్పటి వరకు రాలేదు.

సాధారణంగా నార్త్ జనాలు.... రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్ల సినిమాలు తప్ప ఇతర స్టార్ల సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపరు అనేది నిన్నటి మాట. ఇపుడు సౌత్ యంగ్ హీరోలు, ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ కూడా నార్త్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు అనడానికి ఇలాంటి సంఘటనలను ఉదాహరణగా తీసుకోవచ్చు.

English summary
“Rebel,” directed by Lawrence and starring Prabhas was met with a disastrous result at Tollywood box-office. The flick was recently dubbed into Hindi, and it has become a roaring success on Youtube by garnering more than 1 Crore views.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu