పవర్ ఫుల్ (‘రెబల్’ప్రివ్యూ)
హైదరాబాద్ : చాలా కాలం షూటింగ్ జరుపుకుని ప్రభాస్ కెరీర్ లోనే హై బడ్జెట్ గా రెడీ అయిన చిత్రం 'రెబల్'. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన ఛత్రపతి ని మించుతుందంటూ నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఈ రోజు విడుదల అవుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
కథలో ప్రబాస్ ...కృష్ణ గా కనిపిస్తాడు. కృష్ణ (ప్రభాస్) ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తన చుట్టూ ఉన్నవాళ్లంతా సంతోషంగా ఉంటే చాలనుకొనే మనస్తత్వం అతనిది. తండ్రి (కృష్ణంరాజు) అంటే ప్రాణం. మధు (దీక్షాసేథ్)ని ప్రేమిస్తాడు. ఆమెకీ కృష్ణంటే ఇష్టమే. ఇక అన్నీ సంతోషాలే అనుకొన్న సమయంలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. అవేంటి? వాటికి కృష్ణ ఎలా స్పందించాడు? మధ్యలో డాన్స్ మాస్టర్ రేవతి (తమన్నా) కథేమిటి? అన్నది తెర మీదే చూడాలి.
నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్ పాత్రని లారెన్స్ తీర్చిదిద్దిన విధానం బాగుంది. మాస్‌కి నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. యాక్షన్ ఘట్టాలు అబ్బురపరుస్తాయి''అన్నారు. . లారెన్స్ మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు. ఈ చిత్రంన విడుదల అవుతోంది. అలాగే ప్రభాస్ శైలికి సరిపోయే చిత్రమిది.'రెబల్' అనేది టైటిల్ మాత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది.ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా 'ఛత్రపతి'. ఆ సినిమాను మించే స్థాయిలో మా 'రెబల్' ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
సంస్థ: శ్రీ బాలాజీ సినీ మీడియా
నటీనటులు: ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్, కృష్ణంరాజు, బ్రహ్మానందం, అలీ, సుప్రీత్, ముఖేష్ రుషి, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ తదితరులు.
మాటలు: డార్లింగ్ స్వామి,
ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్,
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఫైట్స్: రామ్ లక్ష్మణ్,
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్,
ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు,
కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్,
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, .
కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్
విడుదల: సెప్టెంబర్ 28,2012.


Click it and Unblock the Notifications











