»   » ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది

ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి తర్వాత ప్రభాస్ 'సాహో' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. టీజర్ బాహుబలి 2 సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో హిందీ, తమిళం, తెలుగులో ప్రదర్శింపబడుతుందని ప్రభాస్ తెలిపారు.

బాహుబలి 2 ఇంటర్వ్యూలో ప్రభాస్ ను తన తర్వాతి సినిమా విషయమై ప్రశ్నించగా అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తన తర్వాతి సినిమా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' పేరుతో తెరకెక్కుతోందని, ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూ. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందన్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే..

ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే..

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే. ఏప్రిల్ 28న సాహో టీజర్ రిలీజ్ కాబోతోంది.

బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో

బాహుబలి-ది కంక్లూజన్ తో పాటు సాహో

బాహుబలి-ది కంక్లూజన్ ఈ నెల 28న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటే ‘సాహో' ఫస్ట్ లుక్. టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేయడం వల్ల ‘సాహో'కు దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రభాస్ రేంజికి తగిన విధంగా

ప్రభాస్ రేంజికి తగిన విధంగా

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇపుడు ఆయన సినిమాలకు తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంది. అందుకే సినిమాకు బడ్జెట్ ఎక్కువైనా మూడు భాషల్లో తీస్తున్నారు.

19వ మూవీ

19వ మూవీ

ప్రభాస్ కెరీర్లో ఇది 19వ సినిమా. రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నపుడు అందుకు తగిన విధంగానే మార్కెటింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. నిర్మాతలు అవన్నీ బేరీజు వేసుకుని మరీ ఇంత బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
Checkout the Prabhas' title look from his up next film Sahoo. The makers have unveiled an interesting pre-look of Sahoo and that is going to take everyone by storm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu