కాపీ వివాదంలో సాహో.. గుట్టుచప్పుడు కాకుండా లేపేశారంటూ ఫైర్
దేశ సినీ పరిశ్రమలో 2019లో ప్రేక్షకులు ఎక్కువ ఎదురు చూసిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. బాహుబలి సినిమా కావడంతో ప్రభాస్ నటించిన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే సినిమా ఓపెనింగ్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ స్ఠాయిలో రూపొందించారనే వార్తల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే తాజాగా సాహో చిత్రం కాపీ వివాదంలో కూరుకుపోవడం మీడియాలో ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

చౌర్యానికి పాల్పడ్డారని
సాహోలో ఓ పాటలో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ తన పెయింటింగ్‌ను పోలి ఉందని, తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా తన ప్రతిభను చౌర్యానికి పాల్పడ్డారని ఆర్టిస్టు షిలో శివ్ సులెమాన్ అనే మహిళ ఆరోపణలు చేసింది. 2014లో ది బర్నింగ్ మ్యాన్ వద్ద ప్రదర్శనకు పెట్టిన పెయింటిగ్‌ను కాపీ కొట్టడం ఎంత వరకు సబబు అని తన ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రశ్నల వర్షం కురిపించారు.

నా పెయింటింగ్ వెనుక కష్టం తెలుసా?
సాహో పాటకు వాడుకొన్న బ్యాక్‌గ్రౌండ్‌కు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎంత కష్టపడితే ఈ పెయిటింగ్‌కు రూపం వచ్చిందో తెలుసా? నా హృదయం ఎంత తపిస్తూ దానికి రూపం పుట్టిందో తెలుసా అంటూ షిలో శివ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధి బర్నింగ్ మ్యాన్ పెయింటింగ్ నా హృదయ స్పందనకు ప్రతిరూపం అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన లేఖలో పేర్కొన్నారు.

మీ కథను ఎవరైనా కాపీ కొడితే
తన పెయింటింగ్‌ను కాపీ కొట్టడంపై షిలో శివ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ మీ అనుమతి లేకుండా మీ కథను కాపీ కొడితే మీకు ఎలా అనిపిస్తుంది? ఏం జరుగుతుందో తెలుసా అంటూ సాహో యూనిట్‌ను నిలదీసింది. తన పెయింటింగ్‌ను సినిమా పోస్టర్‌ను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

హాలీవుడ్ స్థాయి సినిమా అని.. కాపీ కొడుతారా?
అవెంజర్స్: ది ఎండ్‌గేమ్ సినిమా ఓపెనింగ్స్ తుడిచిపెట్టే విధంగా సినిమాను రూపొందించామని గొప్పలు చెప్పుకొంటున్న నిర్మాతలు.. సొంతంగా ఆలోచించి బ్యాక్‌గ్రౌండ్‌ను రూపొందించుకోనే బడ్జెట్ లేదా అంటూ షీలో శివ్ ప్రశ్నలను సంధించారు. షీలో శివ్ పోస్టు చేసిన కామెంట్లకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది. 350 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన సాహో చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











