‘సలార్’ నుంచి షాకింగ్ న్యూస్: మేటర్ లీక్ చేసిన KGF రవి బస్రుర్‌.. ప్రభాస్ ఆ మాట చెప్పాడంటూ!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో అతడితో సినిమాలు తీయడానికి అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శక నిర్మాతలూ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'సాహో' తర్వాత 'రాధే శ్యామ్' అనే రొమాంటిక్ మూవీ చేస్తున్న అతడు.. ఇది పట్టాలపై ఉండగానే ఏకంగా మూడు సినిమాలను ప్రకటించేశాడు. ఇందులో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్' ఒకటి. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్‌ను లీక్ చేశాడు కేజీఎఫ్ రవి బస్రుర్‌. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

KGF దర్శకుడితో యంగ్ రెబెల్ స్టార్

KGF దర్శకుడితో యంగ్ రెబెల్ స్టార్

KGFతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రమే 'సలార్'. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్ భామ శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచేశారు.

అన్నీ హై రేంజ్‌లోనే.. భారీగా ఖర్చు

అన్నీ హై రేంజ్‌లోనే.. భారీగా ఖర్చు

ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై ఆదిలోనే బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అలాగే, లొకేషన్స్, సెట్స్‌ను రిచ్‌గా డిజైన్ చేస్తున్నారు. వీటితో పాటు నటీనటులను, టెక్నీషియన్లను కూడా పేరున్న వాళ్లనే తీసుకుంటున్నారు. అంతేకాదు, స్పెషల్ సాంగ్ కోసం రూ. కోటిన్నర వెచ్చించి ప్రియాంక చోప్రానూ తెస్తున్నారట.

సింగరేణి గనుల్లో ప్రభాస్ పోరాటాలు

సింగరేణి గనుల్లో ప్రభాస్ పోరాటాలు

ఎన్నో అంచనాలున్న 'సలార్' ఆలస్యంగా ప్రకటించినా.. అన్నింటి కంటే ముందే షూటింగ్‌ను ప్రారంభించారు. ఇటీవలే సింగరేణి గనుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. దాదాపు పది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రకరించారు. దానికి సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. ఇక, అక్కడే చిత్ర యూనిట్‌కు యాక్సిడెంట్ కూడా అయింది.

కథ విషయంలో పుకార్లు.. క్లారిటీగా

కథ విషయంలో పుకార్లు.. క్లారిటీగా

'సలార్'ను ప్రకటించినప్పటి నుంచే ఇది 2014లో వచ్చిన 'ఉగ్రం'కు రీమేక్ అని ప్రచారం మొదలైంది. ఆ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రూపొందించాడు. దీంతో ఎటువంటి అభ్యంతరాలు లేకుండానే దీన్ని రీమేక్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్పందించిన డైరెక్టర్ ప్రశాంత్.. ఇది ఏ సినిమాకూ రీమేక్ కాదని, కొత్త కథతోనే రూపొందుతోందని ఇటీవల క్లారిటీ ఇచ్చాడు.

 మేటర్ లీక్ చేసిన KGF రవి బస్రుర్‌

మేటర్ లీక్ చేసిన KGF రవి బస్రుర్‌

ప్రశాంత్ నీల్ 'సలార్' కథ గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు భిన్నంగా తాజాగా మరో న్యూస్ బయటకు వచ్చింది. దీనికి కారణం ఈ చిత్ర సంగీత దర్శకుడు రవి బస్రుర్‌. తాజాగా ఓ కన్నడ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'సలార్' గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలోనే 'ఇది 'ఉగ్రం'కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందేగా' అంటూ అసలు మేటర్ లీక్ చేసేశాడు.

ప్రభాస్ ఆ మాట చెప్పాడంటూ టాక్

ప్రభాస్ ఆ మాట చెప్పాడంటూ టాక్

ఇక, 'సలార్' సంగీతం గురించి కూడా మాట్లాడాడు సంగీత దర్శకుడు రవి బస్రుర్‌. 'ప్రారంభంలో ప్రభాస్ నన్ను పిలిచి KGF రేంజ్‌లో మ్యూజిక్ ఇవ్వాలి అన్నాడు. అంతకు మించి ఉంటుంది. మీరేమీ టెన్షన్ పడకండి అని చెప్పాను. అయినా.. నేనెప్పుడూ మాట్లాడను.. నా పనితనమే మాట్లాడుతుంది.. ప్రేక్షకులతో మాట్లాడిస్తుంది.. పాటలు పాడిస్తుంది' అంటూ చెప్పుకొచ్చాడతను.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X