బ్రేకింగ్: ‘సలార్’ యూనిట్‌కు యాక్సిడెంట్.. వాళ్లందరికీ గాయాలు.. ‘ఆదిపురుష్’ ప్రమాదం రోజే ఇలా!
కొన్నేళ్లుగా వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో తీరిక లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఓ సినిమా పట్టాలపై ఉండగానే.. 'సలార్'నూ ప్రారంభించేశాడు. దీని కోసం సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ మొదటి బాలీవుడ్ చిత్రం 'ఆదిపురుష్' సెట్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అది మరువక ముందే 'సలార్' యూనిట్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇందులో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే....

ఆదిపురుష్ ప్రారంభం.. అగ్నిప్రమాదం
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం కథతో రూపొందుతోన్న ఈ సినిమాను మంగళవారం అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతా సవ్యంగానే సాగుతోన్న సమయంలో ఈ మూవీ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినా.. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

సలార్ మూవీ టీమ్‌కు రోడ్డు ప్రమాదం
'ఆదిపురుష్' ఘటన జరిగిన కొద్ది సమయానికే 'సలార్' మూవీ యూనిట్‌కు కూడా ప్రమాదం జరిగింది. షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తోన్న సమయంలో గోదావరిఖనిలో చిత్ర యూనిట్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని శ్రీనగర్ ఏరియా దగ్గర సలార్ యూనిట్ వాహనం యూటర్న్ తీసుకుంటోన్న సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టినట్లు సమాచారం.

వాళ్లందరికీ గాయాలు.. తప్పించుకుని
సలార్ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తోన్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ఉన్న వాళ్లందరికీ గాయాలైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ వాళ్లంతా చిన్న చిన్న గాయాలతోనే బయట పడ్డారని సమాచారం. అయితే, వాహనం మాత్రం చాలా వరకూ డ్యామేజ్ అయినట్లు తెలిసింది. ఇక, గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారట.

రెండు ప్రమాదాలు.. ప్రభాస్ లేకపోవడం
ఒకేరోజు ముంబైలో 'ఆదిపురుష్' సెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోదావరిఖనిలో 'సలార్' యూనిట్‌కు రోడ్డు యాక్సిడెంట్ జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఒకే హీరో సినిమాలకు ఇలా అవడంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ రెండు చోట్లా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లేకపోవడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

వరుస ప్రమాదాలతో ఫ్యాన్స్‌లో కలవరం
మంగళవారం ఏకంగా రెండు చోట్ల ప్రమాదాలు జరగడంపై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. ఒకే రోజు తమ అభిమాన హీరో సినిమా షూటింగుల్లో ప్రమాదాలు జరగడంపై వాళ్లంతా కలవరపడుతున్నారు. ఈ క్రమంలోనే గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారంతా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
Recommended Video

ప్రభాస్ ఇప్పుడలా రెడీ అవుతున్నాడు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ రాబోతుంది.


Click it and Unblock the Notifications











