ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. సాహో మైండ్ బ్లోయింగ్ వీడియో.. ఎప్పుడంటే?
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ చిత్రం గత రెండేళ్లుగా సెట్స్‌లోనే ఉంది. దుబాయ్‌లో భారీ యాక్షన్ సీన్లు, రామోజీ ఫిలిం సిటీలో అత్యున్నత సెట్టింగులతో సినిమా శరవేగంగా తెరకెక్కుతున్నది. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాహోకు సంబంధించిన మరో టీజర్‌ను మార్చి 3న వదలనున్నారు. వివారాల్లోకి వెళితే..
14 సెకన్ల యాక్షన్ టీజర్
మార్చి 3న రిలీజ్ చేయబోయే షేడ్స్ ఆఫ్ సాహో 2 గురించి తెలిపే ఆసక్తికరమైన టీజర్‌ను ఫిబ్రవరి 26 (మంగళవారం) రిలీజ్ చేశారు. 14 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్‌లో శ్రద్ధాకపూర్ వేగంగా పరిగెత్తడం, కారు ఛేజింగులు, అలాగే ప్రభాస్ బైక్ చేజింగ్ సీన్లు కనిపించాయి.

మార్చి 3న సాహో చాప్టర్2
ఇక సాహో సినిమా గురించి మరింత సమాచారాన్ని ఇచ్చే షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్2 మార్చి 3న రిలీజ్ చేస్తున్నాం. ఆ వీడియోలో మరిన్ని అప్‌డేట్స్ ఉంటాయి. ఆ వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని సాహో ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

రూ. 90 కోట్లతో యాక్షన్ సీన్లు
సాహో చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో రూ.90 కోట్లతో దుబాయ్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు దేశ సినీ చరిత్రలోనే చర్చనీయాంశమయ్యాయి. హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా సాహో ఫైట్స్‌ను కంపోజ్ చేసినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

రూ.300 కోట్లతో మూడు భాషల్లో
సాహో చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతున్నది. మూడు భాషల్లో రూపొందే ఈ చిత్రంలో శ్రద్దాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, ఎవ్లీన్ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరాబేడి తదితరులు నటిస్తున్నారు. సుజిత్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











