సాహో పోస్టర్ వివాదం.. ఇదే మొదటిది కాదు.. మీరే చూడండి..

By Rajababu

Recommended Video

సాహో పోస్టరే కాదు.. అలాంటివి ఎన్నో..మీరే చుడండి..

సినిమా రంగంలో ఇతర భాషల నుంచి స్ఫూర్తి పొంది సినిమాలు తీయడం గానీ, పోస్టర్లు కాపీ కొట్టడం గానీ సర్వసాధారణమే. టెక్నాలజీ, సోషల్ మీడియా అభివృద్ది చెందని కాలంలో అయితే సీన్లకు సీన్లే లేపేసి తమ ప్రతిభగా చెప్పుకొనే వారు. కానీ పరిస్థితి మారింది. ఏదైనా పక్క సినిమా నుంచి లేపేస్తే వెంటనే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతున్నది. ప్రేక్షకులు, పాఠకులు చాలా తెలివి మీరిపోవడంతో వెంటనే కాపీ బండారాన్ని బయటపెడుతున్నారు. సాహో పోస్టర్ ఓ హాలీవుడ్ చిత్రం నుంచి తీసుకొన్నారనే ఆరోపణల నేపథ్యంలో.. అలాంటి కాపీ వీరుల పోస్టర్ కహానీలు మీ కోసం..

 బ్లేడ్ రన్నర్ నుంచి సాహో

బ్లేడ్ రన్నర్ నుంచి సాహో

ప్రభాస్ 38వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న సాహో చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఆ పోస్టర్ ఇటీవల విడుదలైన బ్లేడ్ రన్నర్ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ లుక్‌ను పోలీ ఉండటంతో ప్రేక్షకులు వెంటనే పట్టేశారు. ఫస్ట్ లుక్ విడుదలైన కొద్ది సేపటికే ఇది కాపీ అంటూ రచ్చ రచ్చ చేశారు. సాహో పోస్టర్ మాదిరిగానే ఇటీవల కాలంలో ఈ కాపీ బాగోతం బాగానే నడిపిస్తుందనడానికి ఆధారంగా నిలిచే పోస్టర్లు మీ కోసం..

 ది గ్రే చిత్రం నుంచి భూమి పోస్టర్

ది గ్రే చిత్రం నుంచి భూమి పోస్టర్

జైలు జీవితం తర్వాత సంజయ్ దత్ కమ్ బ్యాక్ మూవీ భూమి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ది గ్రే అనే చిత్రం కాపీ కొట్టినట్టు స్పష్టమైంది.

 బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ నుంచి

బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ నుంచి

రెండు మూడు ఏళ్ల క్రితం షారుక్ ఖాన్ నటించిన రా.వన్ చిత్రంలోని ఓ స్టిల్‌ను బ్యాట్‌మ్యాన్ బిగిన్స్ నుంచి కాపీ కొట్టినట్టు అర్థమవుతున్నది.

 ది రిప్లేస్‌మెంట్ కిల్లర్ నుంచి

ది రిప్లేస్‌మెంట్ కిల్లర్ నుంచి

తెలుగులో ఘన విజయం సాధించిన విక్రమార్కుడు చిత్రాన్ని హిందీలో రౌడీ రాథోడ్ అనే పేరుతో పునర్ర్మించారు. ఈ చిత్రంలోని ఓ పోస్టర్‌ను ది రిప్లేస్‌మెంట్ కిల్లర్ అనే చిత్రంలోనిది అనేది విషయం బయటపడింది.

 ది లంచ్ బాక్స్ ఇలా..

ది లంచ్ బాక్స్ ఇలా..

బాలీవుడ్‌లో చిన్న చిత్రంగా వచ్చిన ది లంచ్ బాక్స్ సెన్సేషనల్‌ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను లూపర్ అనే చిత్రం నుంచి కాపీ కొట్టినట్టు దొరికిపోయారు.

 మర్డర్2 పోస్టర్‌ను

మర్డర్2 పోస్టర్‌ను

హిందీలో వచ్చిన మర్డర్2 చిత్రంలోని పోస్టర్‌ను యాంటీ క్రైస్ట్ అనే చిత్రం నుంచి కాపీ కొట్టారు.

 జెన్నీఫర్ బాడీ నుంచి మర్డర్3

జెన్నీఫర్ బాడీ నుంచి మర్డర్3

ఇటీవల కుర్రకారును ఉర్రూతలూగించిన మర్డర్3 చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను జెన్నీఫర్ బాడీ అనే చిత్రం నుంచి స్ఫూర్తి పొందారు.

 హల్‌చల్ పోస్టర్‌ను

హల్‌చల్ పోస్టర్‌ను

అక్షయ్ ఖన్నా నటించిన బాలీవుడ్ చిత్రం హల్‌చల్ పోస్టర్ కూడా మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ అనే చిత్రం నుంచి కాపీ కొట్టడం గమనార్హం.

 హాలీవుడ్ సినిమాపై తుపాకీ గురి

హాలీవుడ్ సినిమాపై తుపాకీ గురి

ఇక తమిళ సూపర్ స్టార్ నటించిన తుపాకీ చిత్రంలోని ఓ పోస్టర్‌ను యాన్ ఆఫీసర్ అండ్ ఏ జెంటిల్మన్ అనే చిత్రానికి చెందిన పోస్టర్‌ను చూసి డిజైన్ చేశారు.

 ఆంగ్ల చిత్రం నుంచి సింధూ

ఆంగ్ల చిత్రం నుంచి సింధూ

తమిళ చిత్రం సింధూ సామవెలి అనే చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ హలీవుడ్ చిత్రం ది హిల్స్ హావ్ ఐస్ అనే చిత్రంలోని పోస్టర్‌ను పొలి ఉంది.

 అసాసిన్స్ క్రీడ్ నుంచి వేలైయుతమ్

అసాసిన్స్ క్రీడ్ నుంచి వేలైయుతమ్

అలాగే వేలైయుతమ్ అనే సినిమా పోస్టర్ హాలీవుడ్ చిత్రంలోని అసాసిన్స్ క్రీడ్ అనే సినిమాకు సంబంధించినదిగా అర్థమవుతున్నది.

 ఫాలింగ్ డైన్ నుంచి

ఫాలింగ్ డైన్ నుంచి

త్వరలో విడుదల కానున్న వెలైక్కరన్ అనే చిత్రం ఫాలింగ్ డైన్ అనే చిత్రం నుంచి కాపీ కొట్టినట్టు తెలుస్తున్నది.

 ది బార్న్ అల్టిమేటం సినిమా నుంచి

ది బార్న్ అల్టిమేటం సినిమా నుంచి

విలక్షణ నటుడు సూర్య చిత్రం మాస్ పోస్టర్ కూడా ది బార్న్ అల్టిమేటం అనే పోస్టర్‌ను పోలి ఉండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X