Prabhas పోస్టర్ కిర్రాక్.. ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్న లుక్.. ఏ సినిమా పోస్టర్ అంటే!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఎవరూ ఊహించని విధంగా మారిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్‌కు అడ్డాగా ప్రభాస్ మారిపోయాడు. బాలీవుడ్ హీరోలు అందుకోనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ శరవేగంగా దూసుకుపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ నటించిన సాహో మూవీకి సంబంధించి ఇప్పటి వరకు చూడని పోస్టర్ సోషల్ మీడియాలో వెలుగు చూసింది. ఇంకేముంది కొద్ది క్షణాల్లోనే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలో ప్రభాస్ గురించి, ట్రెండింగ్ అవుతున్న పోస్టర్ వివరాల్లోకి వెళితే...

సోషల్ మీడియాలో మరింత బలంగా

సోషల్ మీడియాలో మరింత బలంగా

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్‌కు సోషల్ మీడియాలో భారీగా బలం పెరిగింది. ఏ సందర్భమైనా వేల సంఖ్యలో ట్వీట్లతో ట్రెండింగ్‌గా మారుతుంటారు. ఊహించిన విధంగా ఫ్యాన్ గణం, నెటిజన్లు ఉండటంతో ప్రభాస్ తరచూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ మారుతుంటారు. ఇలాంటి కోవలోనే సాహో పాత పోస్టర్ ట్రెండింగ్‌గా మారింది.

సాహో పోస్టర్ వైరల్

సాహో పోస్టర్ వైరల్

సాహో పోస్టర్ ట్రెండింగ్‌లోకి వచ్చిన తర్వాత నెటిజన్లు, అభిమానులు రకరకాల కామెంట్లు వదిలారు. ఈ పోస్టర్ ఫస్ట్ లుక్‌గా వచ్చి ఉంటే.. రచ్చ ఎలాగా ఉండేదో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ పోస్టర్ అదిరిపోయింది.. సినిమాలో ఈ సీన్ ఉంటే దుమ్మురేగిపోయేది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 సాహోకు సీక్వెల్ అంటూ

సాహోకు సీక్వెల్ అంటూ

సాహో పోస్టర్ చూసి నెటిజెన్స్ అత్యుత్సాహాన్ని కూడా ప్రదర్శిస్తూ.. సాహోకు సీక్వెల్‌గా సాహో 2 వస్తున్నది. త్వరలోనే సుజిత్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానున్నది అంటూ అభిమానులు చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ కనిపించింది. అయితే సాహో 2 సీక్వెల్‌ వస్తుందా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేమని సినీ వర్గాలు అంటున్నాయి.

బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

దర్శకులపై ప్రభాస్ ప్రభావం

దర్శకులపై ప్రభాస్ ప్రభావం

ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రభావం ఎంతగా ఉందంటే.. ఆయనతో నటించే హీరోయిన్లు గానీ.. పనిచేసే డైరెక్టర్లకు కూడా అత్యధికంగా ఫాలోవర్స్ పెరగడం కనిపిస్తున్నది. రాధేశ్యామ్ కోసం ప్రభాస్‌తో పనిచేయడానికి ముందు రాధాకృష్ణకు ఉన్న ట్విట్టర్ ఫాలోవర్స్ 5 వేలు, ఆ తర్వాత 51 వేలకు పెరిగారు. అలాగే ఆదిపురుష్ సినిమాకు ముందు దర్శకుడు ఓం రావత్‌కు 9 వేల ట్విట్టర్ ఫాలోవర్స్ ఆ తర్వాత 41 వేలకు ఫాలోవర్స్ పెరిగారు. ఇక ప్రభాస్‌తో ప్రాజెక్టు అనౌన్స్ చేయడానికి ముందు నాగ్ అశ్విన్‌ ట్విట్టర్ ఫాలోవర్స్ 15 వేలు, ఆ తర్వాత 73 వేల ఫాలోవర్స్ పెరిగిపోయారు.

Recommended Video

Adipurush Update : Kichcha Sudeep To Play Pivotal Role In Prabhas Adipurush || Filmibeat Telugu
ప్రభాస్ కెరీర్ ఇలా...

ప్రభాస్ కెరీర్ ఇలా...

ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ ఆలస్యమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, దర్శకుడు ఓం రావత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ చ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్‌తో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X