సాహో పబ్లిక్ టాక్.. థియేటర్ల వద్ద జనం ఏమంటున్నారో చూడండి
సాహో పబ్లిక్ టాక్.. థియేటర్ల వద్ద జనం ఏమంటున్నారో చూడండి
ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూపులకు తెరపడింది. వరల్డ్ వైడ్‌గా సాహో సినిమా భారీ రేంజ్‌లో విడుదలైంది. ఇప్పటికే యూఎస్ లో షోస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ముగియడంతో సాహో ప్రీ టాక్ బయటకు వచ్చింది. సాహోలో బెస్ట్ స్క్రీన్ ప్లేతో పాటు కొన్ని అబ్బురపరిచే హెలైట్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే సినిమా చూసిన పబ్లిక్ ఏమంటున్నారో చూస్తే..
Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starre

హాలీవుడ్ రేంజ్‌లో సాహో
సినిమా చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 3 సినిమాను మించి ఉంది. ప్రభాస్ యాక్షన్ హైలైట్.. శ్రద్దా, ప్రభాస్ మధ్య కెమిస్ట్రీ అదిరింది అంటూ థియేటర్ వద్ద పలువురు ఆడియన్స్ చెబుతున్నారు.

ప్రభాస్ మంచి నాన్ వెజ్ ఫుడ్ పెట్టాడు
బాహుబలి సినిమాలో అంతా రాజమౌళి ప్రతిభే అన్నారు. కానీ సాహోలో ప్రభాస్ రేంజ్ ఏంటో నిరూపించాడు. ఫైట్స్ కేక. ప్రభాస్ మంచి నాన్ వెజ్ ఫుడ్ పెట్టాడు అంటూ థియేటర్స్ అన్నీ కోలాహలంగా కనిపిస్తున్నాయి. బిల్లాతో పోల్చుకుంటే సాహో హాయ్ రేంజ్ లో ఉందని అంటున్నారు.

ఇదో హాలీవుడ్ సినిమా..
డైరెక్షన్ సూపర్. రెండో సినిమా తీశాడనే కానీ ఓ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో తీశాడు. సూపర్. యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరుస్తున్నాయి. ఇది టాలీవుడ్ మూవీ కాదు హాలీవుడ్ మూవీ. ఇంటర్వెల్ బాంగ్, సెకండాఫ్, క్లైమాక్స్ సూపర్ అని సాహో చూసిన ఓ ప్రేక్షకుడు చెప్పాడు.

ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ అదిరింది
తెలుగు మూవీ లాగా లేదు. ఇంగ్లీష్ సినిమాలా ఉంది. జేమ్స్ బాండ్ మూవీలా ఉంది. రెగ్యులర్ తెలుగు సినిమాలకు భిన్నంగా తీశారు. ప్రభాస్ యాక్షన్, లుక్ హైలైట్. చాలా రిచ్ సన్నివేశాలు ఉన్నాయి. సూపర్ హిట్ సినిమా. ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ అదిరింది. తెలుగు వాళ్ళు గర్వపడే సినిమా అంటున్నాడు మరో ప్రేక్షకుడు.

సాహో మూవీ వివరాలు
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











