Saaho movie Highlights: ప్రభాస్ లుక్.. హైలైట్ సన్నివేశాలు ఇవే..

Recommended Video

Saaho Movie Highlights || Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూపులకు తెరపడింది. వరల్డ్ వైడ్‌గా సాహో సినిమా భారీ రేంజ్ లో విడుదలైంది. ఇప్పటికే యూఎస్ లో షోస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ముగియడంతో సాహో ప్రీ టాక్ బయటకు వచ్చింది. సాహోలో బెస్ట్ స్క్రీన్ ప్లేతో పాటు కొన్ని అబ్బురపరిచే హెలైట్ సన్నివేశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమాపై ఓ కన్నేస్తే..

సాహో నిడివి.. తనికెళ్ళ భరణి ఎంట్రీ

సాహో నిడివి.. తనికెళ్ళ భరణి ఎంట్రీ

171 నిమిషాల నిడివితో సాహో సినిమా థియేటర్స్ లో ప్రదర్శించబడింది. సినిమా స్టార్టింగ్ లోనే విలన్ గ్యాంగ్స్ ను పరిచయం చేస్తూ ఓ క్లుప్తమైన సన్నివేశం వస్తుంది. ఆ తర్వాత తనికెళ్ళ భరణి పాత్ర ఎంటర్ అవుతుంది. ఆ వెంటనే జాకీ ష్రాఫ్, కమెడియన్ వెన్నెల కిషోర్ పరిచయం జరుగుతుంది.

భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ ఎంట్రీ

భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ ఎంట్రీ

ఓ ఐదు నిమిషాల తర్వాత 2000 కోట్ల దొంగతనం కేసుకు సంబంధించి పోలీసుల మధ్య సీరియస్ చర్చ నడవడం, ఆ వెంటనే భారీ యాక్షన్ సీన్‌తో థియేటర్స్ దద్దరిల్లి పోయేలా ప్రభాస్ (అశోక్) పవర్ ఫుల్ ఎంట్రీ ఉంటుంది. ఆ వెంటనే అరుణ్ విజయ్ పాత్ర పరిచయం జరుగుతుంది.

క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా శ్రద్ధ కపూర్

క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా శ్రద్ధ కపూర్

ఇక హీరోయిన్ శ్రద్ధ కపూర్ (అమృత) క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ మధ్యలో ప్రభాస్,వెన్నెల కిషోర్, మురళి శర్మల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు నవ్విస్తాయి. ప్రభాస్ (అశోక్) దొంగతనం 2000 కోట్ల దొంగతనం కేసుకు సంబంధించి ఓ క్లూ పెట్టేస్తాడు.

ప్రభాస్, శ్రద్ద కపూర్ ప్లాన్

ప్రభాస్, శ్రద్ద కపూర్ ప్లాన్

ఇంకా ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రభాస్, శ్రద్ద కపూర్ ప్లాన్ వేయడం, ఈ కోణంలో కొన్ని ఫన్నీ సన్నివేశాలు రావడం, ఆ వెంటనే సైకో సైయాన్ లో ప్రభాస్, శ్రద్ద కపూర్ చిందులేయడం జరుగుతాయి. ఆ వెంటనే కథనంలో సీరియస్ నెస్ మొదలవుతుంది. విలన్ గ్యాంగ్ బ్లాక్ బాక్స్ ను కనుగొనే ప్రయత్నం మొదలు కావడంతో కథ సీరియస్ అవుతుంది.

ప్రభాస్ అసలు రంగు.. ఇంటర్వెల్

ప్రభాస్ అసలు రంగు.. ఇంటర్వెల్

అదే బ్లాక్ బాక్స్ కోసం నీల్ నితిన్ ముఖేష్ ఎంటర్ అవుతాడు. జై పాత్రలో ఈయనది కూడా బ్లాక్ బాక్స్ వెతికే ప్రయత్నమే. ఆ తరువాత అబ్బురపరిచే చేసింగ్ సీన్. ఆ వెంటనే ప్రభాస్ పాత్రకు సంబంధించి అసలు రంగు బయట పడడంతో ఇంటర్వెల్.

బ్యాడ్ బాయ్ సాంగ్.. కలర్ ఫుల్ భామలతో కాస్త మసాలా

బ్యాడ్ బాయ్ సాంగ్.. కలర్ ఫుల్ భామలతో కాస్త మసాలా

ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ కాగానే బ్యాడ్ బాయ్ సాంగ్. ఈ సాంగ్ లో జాక్వలిన్ ప్రభాస్ చిందులు. కలర్ ఫుల్ భామలతో కాస్త మసాలా యాడ్ అవుతుంది. ఈ సాంగ్ పూర్తికాగానే విలన్ చుంకీ పాండేతో కొన్ని సన్నివేశాలు. మళ్ళీ అదే బ్లాక్ బాక్స్ కోసం చర్చ.

 ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై దాడి

ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై దాడి

అలా అలా సీన్స్ నడుస్తూ ఉండగా విలన్ గ్యాంగ్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఆ దాడి నుంచి తప్పించుకోవడం.. ఆ వెంటనే 'బేబీ వోంట్ యూ టెల్ మీ' డ్యూయట్ వస్తుంది. అలా విలన్ గ్యాంగ్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై దాడికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక విలన్ గ్యాంగ్ తో ప్రభాస్ ఫైట్. అంతా బ్లాక్ బాక్స్ కోసమే.

బ్లాక్ బాక్స్ వెనుకున్న మిస్టరీ రివీల్

బ్లాక్ బాక్స్ వెనుకున్న మిస్టరీ రివీల్

ఆ వెంటనే మరో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశం. విలన్ గ్యాంగ్ నుంచి తప్పించుకోడానికి ప్రభాస్ ప్రయత్నాలు.. ఆ తరువాత.. ఆ బ్లాక్ బాక్స్ వెనుకున్న మిస్టరీలను అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ లు వెల్లడించడం జరుగుతుంది. దీంతో ప్రభాస్, చుంకీ పాండేల మధ్య ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఇక చివరకు ఏం జరిగింది? సినిమా ఎలా ముగిసిందనేది? మీరే చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X