‘సాహో’ తెలుగు సినిమాయేనా? ప్రభాస్ సినిమాపై పేలుతున్న పంచులు
'బాహుబలి'తో యూనివర్సల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత అతడిపై భారీ అంచనాలే పెట్టుకున్నారంతా. అందరి అంచనాలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో మరోసారి భారీ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే 'సాహో'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'సాహో'తో తడాకా చూపించాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ సినిమాను సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

అయితే, రెండు రోజుల క్రితం విడుదలైన పాట విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. 'సైకో సయాన్' అంటూ సాగే ఈ పాటపై తెలుగు ప్రేక్షకులు పెదవి విస్తున్నారు. పార్టీ సాంగ్ తరహాలో చిత్రీకరించిన ఈ పాటలో శ్రద్దాకపూర్ హాట్ హాట్‌గా కనిపిస్తోంది. ప్రభాస్ తన లుక్స్‌తో ఆకట్టుకునేలా ఉన్నాడు. అయినా సరే 'సాహో'ను తెలుగు సినీ ప్రియులు ఓన్ చేసుకోవడం అనుమానంగానే ఉంది.

దీనికి కారణం పాటకు వచ్చిన వ్యూస్.. దాని కింద ఉన్న కామెంట్లే. 'సైకో సయాన్' హిందీ వెర్షన్ సాంగ్‌కు ఇప్పటికే 16 మిలియన్ల వ్యూస్ రాగా, తెలుగు వెర్షన్ సాంగ్‌కు మాత్రం 3.7 మిలియన్స్ మాత్రమే వచ్చాయి. దీనికితోడు, చాలా మంది ఈ పాట తెలుగు కంటే హిందీ నేటివిటీకి దగ్గరగా ఉందని అంటున్నారు. అంతేకాదు, లిరిక్స్ కూడా తెలుగు పాటలా అనిపించడం లేదని ఒకరంటే.. హిందీ పాటకు తెలుగు హీరో డ్యాన్స్ చేశాడని మరొకరు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో 'సాహో'ను తెలుగు వాళ్లు ఆదరిస్తారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











