అంత ఆలస్యమా..? సాహో వచ్చేది 2019లోనే?

Recommended Video

సాహో అంత ఆలస్యమా..? | Filmibeat Telugu

బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన "బాహుబలి" సినిమాల అనంతరం ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' దేశవ్యాప్తంగా క్రేజ్‌ నెలకొంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్‌ ఇలా భారతీయ చిత్ర పరిశ్రమలన్నింటిలోనూ ఈ సినిమాపై చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

 యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలు

యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలు

రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం కొంచెం రెస్ట్ లో ఉంది. మరికొన్ని రోజుల్లో దుబాయ్ లో కొన్ని యాక్షన్ ప్రధానమైన సన్నివేశాలను తెరకెక్కించడానికి సాహో టీమ్ రెడీ అవుతోంది. అయితే ముందుగా అనుకున్న డేట్ ప్రకారం కొన్ని కారణాల వల్ల షెడ్యూల్ పూర్తవ్వకపోవచ్చు అనే టాక్ బాగా వినిపిస్తోంది.

2019లో వచ్చే అవకాశం

2019లో వచ్చే అవకాశం

అయితే, వీఎఫ్‌ఎక్స్‌ మిక్సింగ్‌ కోసం కొంచెం ఎక్కువ సమయం పడితే.. 2019లో ఈ సినిమా వచ్చే అవకాశముంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది.

కళ్లుచెదిరే స్టంట్‌ సీక్వెన్స్‌

కళ్లుచెదిరే స్టంట్‌ సీక్వెన్స్‌

ట్రాన్స్‌ఫార్మర్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్‌ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్‌ సీక్వెన్స్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఎక్కువగా నార్త్ కు చెందిన నటీనటులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ప్రముఖ నటుడు షెడ్యూల్ కారణంగా సినిమా ఆలస్యంగా స్టార్ట్ అవబోతోందని టాక్.

 బాలీవుడ్ స్టార్స్

బాలీవుడ్ స్టార్స్

సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ - శ్రద్ధా కపూర్ - మందిరా బేడి వంటి బాలీవుడ్ స్టార్స్ కీలకపాత్రలను పోషిస్తున్నారు. మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మొదట సినిమాను నెక్స్ట్ ఇయర్ దసరా కానుకగా రిలీజ్ చేస్తామని యూవీ క్రియేషన్స్ చెబుతూ వస్తోంది.

గ్రాఫిక్స్‌కి టైమ్ పట్టొచ్చు

గ్రాఫిక్స్‌కి టైమ్ పట్టొచ్చు

కానీ ఇప్పుడు అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అనే టాక్ బాగా వినిపిస్తోంది. సినిమా ఎంత త్వరగా పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ తో కూడుకున్న సీన్స్ సినిమాలో హైలెట్ కాబట్టి గ్రాఫిక్స్ పనులకు టైమ్ పట్టొచ్చు. దీంతో సినిమాను మొత్తంగా 2019లో ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X