‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. సింగరేణి గనులకు ప్రభాస్ గుడ్ బై
ప్రభాస్ ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనుల్లో యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ కోసం ప్రభాస్ బొగ్గు గనుల్లో అడుగుపెట్టేశాడు. అయితే గత పది రోజుల నుంచి రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో ప్రభాస్ సలార్ చిత్రం షూటింగ్ జరుగుతూ వచ్చింది. అయితే ప్రభాస్ సలార్ మూవీ తన ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక సలార్ యూనిట్ ఆ ప్రదేశానికి గుడ్ బై చెప్పేసింది.
Recommended Video

మొదటి సారిగా..
సింగరేణి బొగ్గు గనుల్లో ప్యాన్ ఇండియన్ మూవీ షూటింగ్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. మామూలుగానే తెలుగు సినిమాలు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోవు. కానీ సలార్ యూనిట్ సింగరేణి ప్రాంతంలో అడుగుపెట్టడంతో అందరూ ఇటు వైపే చూశారు.

భారీ భద్రత..
ప్రభాస్ సలార్ సినిమా కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశాడు. ప్రత్యేకంగా ప్రభాస్ కోసం ఎస్పీ కూడా రంగంలోకి దిగాడు. అయితే సలార్ యూనిట్‌కు నక్సల్స్ నుంచి హామీ ఉందనే సమాచారం రావడంతోనే అంతలా హై సెక్యూరిటీ కల్పించినట్టు తెలుస్తోంది.

శ్రుతీ హాసన్ కూడా..
బొగ్గు గనుల్లో ఏర్పాటు చేసిన ఈ షెడ్యూల్‌లో శ్రుతీ హాసన్ కూడా పాల్గొంది. ప్రభాస్ శ్రుతీ హాసన్ మధ్య వచ్చే కొన్ని సీన్లను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు సినిమాటోగ్రఫర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

మొదటి షెడ్యూల్ పూర్తి..
పది రోజుల పాటు షూట్ చేసిన సలార్ నేటితో పూర్తయింది. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కావడంతో యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. కెమెరామెన్ భువన గౌడ ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందంటూ చెప్పుకొచ్చాడు.

మరో వైపు అలా..
ఒక వైపు ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకు కాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. ఇంకో వైపు సలార్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. మరి ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్‌లో జాయిన్ అవుతాడో లేదో రెస్ట్ తీసుకుంటాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











